వాలెంటైన్స్ డే స్పెషల్ మేసేజ్‌లు..!

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 10:31 AM IST
వాలెంటైన్స్ డే స్పెషల్ మేసేజ్‌లు..!

Updated On : February 13, 2019 / 10:31 AM IST

నీ మాటలే నా పాటకు పల్లవి చరణాలు
నీ ఉహలే నా యదలోపూచే పుష్పాలు
నీ హొయలే నా గుండెలోతుల్లో వెలిగే దీపాలు
నీ నవ్వులే నా జీవితానికి నిండైన వెలుగులు
హ్యాపీ వాలెంటైన్స్ డే..

మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు
మనల్ని వెతుకుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ
హ్యాపీ వాలెంటైన్స్ డే..

ప్రకృతిలోని పంచభూతాల సాక్షిగా 
సాగరంలోని ప్రతి నీటి బిందువు సాక్షిగా 
పువ్వులోని మకరందం సాక్షిగా
మైమరచి పాడే కోయిల సాక్షిగా
నేను ఇష్టపడే చంద్రుని సాక్షిగా
నేను నీ దానిని హ్యాపీ వాలెంటైన్స్ డే..

పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు
పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ
హ్యాపీ వాలెంటైన్స్ డే..

జీవితం ఓ ప్రయాణం…
జీవనం ఓ ప్రమాణమని ఎవరో అన్నారు
నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి
నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి
హ్యాపీ వాలెంటైన్స్ డే..