Sperm Count : వీర్యకణాలను పెంచే వాల్ నట్స్!
అయితే వాల్నట్లను తినే ముందు, మీకు వాటిని తీసుకోవటం వల్ల అలెర్జీ వంటివి వస్తాయోలేదోనని నిర్ధారించుకోవటం మంచిది. ట్రీ నట్ అలెర్జీ ఉన్నప్పుడు వాల్నట్లను తీసుకోవడం ఏమాత్రం మంచిదికాదు.

Sperm Count
Sperm Count : భార్యభర్తల దాంపత్య జీవితంలో భాగస్వామి గర్భం దాల్చడానికి వీర్యకణాలు అనేవి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. స్పెర్మ్ కౌంట్ 40శాతం కంటే తక్కువ చలనశీలతను కలిగి ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. స్పెర్మ్ కౌంటే తక్కువగా ఉండటమే దీనికి కారణమని వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయితే మాత్రం వీర్యకణాలను పెంచుకునే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వీర్యకణాలను పెంచుకునేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతగానో దోహదపడతాయి.
స్పెర్మ్ యొక్క ఆకృతి, చలనశీలతను మెరుగుపరచడానికి, ప్రతిరోజూ కొన్ని వాల్నట్లను తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతోపాటు గర్భం దాల్చే అవకాశాలను పెంచుతాయట. వీటిని రోజూ తీసుకుంటే.. వీర్య కణాలు చురుగ్గా మారడంతోపాటు.. వాటి కదలిక వేగవంతం అవుతుంది. పరిమాణం కూడా పెరుగుతుంది. వాల్‌నట్స్‌లో అధిక స్థాయిలో ఒమేగా-6 మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరుస్తాయి. స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి.
117 మంది ఆరోగ్యవంతమైన పురుషులపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో వాల్నట్ల ప్రభావాలపై పరిశీల జరిపేందుకు పాల్గొనేవారిని 2 గ్రూపులుగా విభజించారు. 59 మంది పురుషులతో కూడిన ఒక సమూహం ప్రతిరోజూ 75 గ్రా వాల్నట్లను అందించారు. అయితే 58 మంది పురుషులు ఉన్న ఇతర సమూహనికి ఎలాంటి గింజలను ఇవ్వలేదు. అక్రోట్లను తినే పురుషుల్లో ఒమేగా -6 మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల స్థాయి పెరగటాన్ని వారు గుర్తించారు. స్పెర్మ్ చలనశీలత , నిర్మాణంలో మెరుగుదలని గుర్తించటమే కాకుండా వారి స్పెర్మ్‌లో తక్కువ క్రోమోజోమ్ అసాధారణతలను కలిగివుండటాన్ని గమనించారు.
వాల్ నట్స్ తోపాటు వీర్యకణాలు పెంచటంలో పప్పు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ప్రతిరోజు లంచ్‌లో, రాత్రి డిన్నర్లో భాగంగా పప్పులను తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇతర ఆహారాలు టొమాటోలు, బచ్చలికూర, గుడ్లు, బ్రోకలీ, ఆస్పరాగస్, అరటిపండ్లు, దానిమ్మ, నారింజ, అవకాడోలు, జిన్సెంగ్, వెల్లుల్లి మరియు గుమ్మడికాయ గింజలు సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి, గర్భధారణ అవకాశాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి.
అయితే వాల్నట్లను తినే ముందు, మీకు వాటిని తీసుకోవటం వల్ల అలెర్జీ వంటివి వస్తాయోలేదోనని నిర్ధారించుకోవటం మంచిది. ట్రీ నట్ అలెర్జీ ఉన్నప్పుడు వాల్నట్లను తీసుకోవడం ఏమాత్రం మంచిదికాదు. వాల్నట్లను మితంగా తినాలన్న విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు. వాల్నట్లను పరిమితికి మించి ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం మరియు విరేచనాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. వీర్యకణాల తగ్గుదల విషయంలో వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుని సరైన చికిత్స పొందటం ఉత్తమం.