Weight Gain : బరువు పెరగాలనుకుంటున్నారా… అయితే మీకోసం డైట్ ప్లాన్
ఉదయం అల్పాహారం తీసుకున్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తినడం వల్ల బరువు పెరగడం లో సహకరిస్తుంది. అదే సమయంలో మజ్జిగ తాగటం మంచిది. మజ్జిగ ఆకలి ప్రేరేపిస్తుంది. ఆకలి పెరిగేలా చేస్తుం

Weight (1)
Weight Gain : అధిక బరువు కలిగి ఉండటం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో, బరువు తక్కువగా ఉండటం అంతే ప్రమాదం. చాలా మంది బరువు పెరగేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు పెరగక పోవటానికి ప్రధాన కారణం ఆహారం తీసుకోవటంలో లోపం కారణంగా హార్మోన్లు సరిగా పనిచేయక బరువు పెరగలేక పోతున్నామని ఏమాత్రం గ్రహించరు. ఆరోగ్య కరంగా బరువు పెరగకుండా, జంక్ ఫుడ్ తింటే బాగా బరువు పెరుగుతారంటూ అనవసరపు సలహాలు ఇచ్చే వారు బాగా పెరిగిపోయారు. ఇలా చేస్తే బరువు పెరగటం సంగతి అంటుంచి కొవ్వులు పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఆరోగ్య కరంగా బరువు పెరగాలనుకునే వారికోసం ప్రత్యేకంగా డైట్ ప్లాన్ ను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటో తెలుసుకోండి..ప్రతిరోజు ఉదయం ఆరోగ్యకరమైన శరీరం కోసం, అవసరమైన శక్తిని అందించడానికి అల్పాహారం చాలా ముఖ్యం. అల్పాహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఫైబర్లు, తృణధాన్యాలు ఉండేలా చుసుకోవాలి.అల్పాహారంగా రోజుకు రెండు గుడ్లు తినడం మంచిది మరియు గుడ్డు లో ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి గుడ్ల నుండి పచ్చసొనను వేరు చేయకుండా తినడం ఉత్తమం. బ్రెడ్ తో పాటు వెన్న చీజ్ బట్టర్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన కొవ్వు అందుతుంది. పరోటా నెయ్యి, వెన్నతో కాల్చుకుని తినటం వల్లకూడా బరువు వేగంగా పెరగడానికి సహకరిస్తుంది.
ఉదయం అల్పాహారం తీసుకున్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తినడం వల్ల బరువు పెరగడం లో సహకరిస్తుంది. అదే సమయంలో మజ్జిగ తాగటం మంచిది. మజ్జిగ ఆకలి ప్రేరేపిస్తుంది. ఆకలి పెరిగేలా చేస్తుంది దీనివల్ల ఎక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది. మిల్క్ తాగడం వల్ల దానిలో ఉండే క్యాలరీస్ త్వరగా బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. మధ్యాహ్నం భోజనం లో రోటి, నెయ్యి తో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కూరగాయల లేదా బీన్స్, బంగాళాదుంపలు వంటివి తీసుకోవాలి. బరువు పెరగడం కోసం ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన బరువు పెరిగేటందుకు దోహదపడుతుంది. అన్నం తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. రోటి తో ఒక కప్పు పెరుగు లేదా పప్పు లేదా కోడి మాంసాన్ని తీసుకోవచ్చు. పప్పు మరియు పెరుగు తియ్యగా ఉండే లా తీసుకుంటే అధిక బరువు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.
సాయంత్రం స్నాక్స్ గా బరువు పెరగడానికి చిరుతిండ్లు తీసుకోవడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న బంగాళదుంపతో చేసిన చిరుతిళ్ళు, చికెన్ శాండ్విచ్, బటర్ తో చేసిన ఆహారం తినడం వల్ల బరువు పెరుగుదల వేగంగా జరుగుతుంది. రాత్రి తీసుకునే భోజనం శరీర పెరుగుదలకు చాలా సహకరిస్తుంది. రాత్రి భోజనానికి ప్రొటీన్లు, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి లేదా కూరగాయలు మరియు మాంసం తో చేసిన ఆహారం ఎంచుకోవడం వలన బరువు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రాత్రి పడుకోబోయే ముందు ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వలన బరువు పెరుగుతారు.
వ్యాయామం అంటే అందరూ అధిక బరువు ఉన్నవారు చేస్తారు అని అనుకుంటారు కాని బలహీనంగా ఉండే వాళ్ళు చేయడం వల్ల వారిలో ఆకలి పెంచడానికి సహకరిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే వ్యాయామం చేయడం వల్ల శరీర కండరాలు సరిగా అభివృద్ధి చెందుతాయి. వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ మోతాదు లో ఉండి శరీర కండరాల సరిగ్గా పని పనిచేస్తుంది. ఆకలిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆహార నియమాలు పాటించటం ద్వారా స్వల్పకాలంలోనే బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది.