Feeling Hungry : జంక్ ఫుడ్ , చక్కెర ఆహారాలు తినాలన్న కోరికలు తగ్గించుకోవాలనుకుంటే ?

రోజువారీగా తినే భోజనంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే తినాలన్న కోరికలు తగ్గుతాయి. చర్మం, కండరాలు, ఎముకలు, జుట్టు , గోళ్లను ధృడంగా చేయటంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరాన్ని అవసరమైన 20 రకాల అమినో యాసిడ్‌లను ప్రోటీన్‌ కలిగి ఉంటుంది.

Feeling Hungry : ఆకలి అనిపించడం ప్రతి మనిషిలో సర్వసాధారణ విషయం. అయితే పదే పదే ఆకలిగా అనిపించడం వల్ల అదే పనిగా ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో క్యాలరీలు తీసుకోవడం పెరుగుతుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవనంలో  ఆహారంలో జంక్ ఫుడ్ ప్రధానమైన భాగమైపోయింది. వివిధ రకాల మసాలాలు, పిజ్జాలు, బర్గర్లులు , చీజ్‌లతో తయారు చేసిన జంక్ ఫుడ్ చాలా మందిని ఆకర్షిస్తుంటాయి.

READ ALSO : Natural Anaesthesia : అనస్థీషియా లక్షణాలతో కూడిన ఆహారాలు.. అవేంటో తెలుసా ?

అయితే వీటిని తినటం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఈ విషయం అందరికి తెలుసు అయినప్పటికీ మరో మార్గంలేక అధిక మోతాదులో నిత్యం వీటిని తీసుకుంటుంటారు. రోజువారిగా అదేపనిగా జంక్ ఫుడ్ తినాలన్న కోరికలు పెరుగుతాయి. ఈ కోరికలను తగ్గించుకోవటానకి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. దీనిని నుండి సులభంగా బయటపడటానికి కొన్ని మార్గాలు మీకోసం..

1. ఎక్కువ మొత్తంలో నీరు త్రాగటం ;

పదే పదే ఆకలి అనిపిస్తుంటే ఏదైనా తినడానికి బదులు నీళ్లు తాగటం మంచిది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అధిక క్యాలరీలను తీసుకోకుండా నిరోధించేందుకు సహాయపడుతుంది. అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉంటే ఆహార కోరికల సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

READ ALSO :  Seasonal Diseases : పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. నివారణకు అనుసరించాల్సిన సరైన పద్ధతులు

2. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ;

రోజువారీగా తినే భోజనంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే తినాలన్న కోరికలు తగ్గుతాయి. చర్మం, కండరాలు, ఎముకలు, జుట్టు , గోళ్లను ధృడంగా చేయటంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరాన్ని అవసరమైన 20 రకాల అమినో యాసిడ్‌లను ప్రోటీన్‌ కలిగి ఉంటుంది.

3. పుల్లటి పదార్దాలను భోజనంలో భాగం చేసుకోవటం ;

పులిసిన ఆహారం శరీరానికి ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్‌లను అందిస్తుంది. భోజనంలో పెరుగు, పులియబెట్టిన సోయాబీన్స్‌తో తయారు చేసిన టేంపే, పులియబెట్టిన కూరగాయలతో తయారు చేసిన పదార్ధాలను తీసుకోవచ్చు. ఇది మన పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా చక్కెర పదార్ధాలు తినాలన్న కోరికలను తగ్గిస్తుంది.

READ ALSO : KCR : ప్రచార పర్వంలో గులాబీ బాస్ జోష్.. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

4. బయటి వాతావరణంలో నడక ;

రోజుకు 15 నుండి 20 నిమిషాలు బయటి వాతావరణంలో వాకింగ్ చేయటం వల్ల ఆహారం తినాలన్న కోరికలు తగ్గి శక్తి పెరుగుతుంది. అంతేకుండా శరీర ఆరోగ్యానికి వాకింగ్ ఎంతగానో సహాయపడతుంది. ఆసమయంలో తినాల్న కోరికలు తగ్గించుకోవచ్చు.

5. పండ్లను తీసుకోవటం ;

చక్కెర పదార్ధాలు తినాలన్న కోరికలకు అడ్డుకట్ట వేసేందుకు పండ్లు తీసుకోవటం మంచి అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు. పండ్లలో తీపి తక్కువగా ఉండటం వల్ల ఫైబర్ , పోషకాలు శరీరానికి అందుతాయి. చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా గింజలు, ఎండిన పండ్ల వంటి ఆహారాలను తీసుకోవటం మంచిది.

READ ALSO : Navaratri 2023 : పరమశివుడికే అన్నదానం చేసిన ‘అన్నపూర్ణా దేవి’

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు