Seasonal Diseases : పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. నివారణకు అనుసరించాల్సిన సరైన పద్ధతులు

నిద్ర లేకపోవడం శరీరానికి రక్షణగా ఉండే రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరుస్తుంది. రోగనిరోధక శక్తిని రీఛార్జ్ చేయడానికి ప్రతి రాత్రి 7-9 గంటల సమయం నిద్రించటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.

Seasonal Diseases : పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. నివారణకు అనుసరించాల్సిన సరైన పద్ధతులు

Seasonal Diseases

Seasonal Diseases : భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సీజనల్ వ్యాధుల కేసులు 20% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా పట్టణాలలో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. దీనికి ముఖ్యకారణం వాయు కాలుష్యమని చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా సాధారణ జలుబు, ఫ్లూ , వైరల్ జ్వరాలతో సహా వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది.

READ ALSO : Bathukamma 2023 : నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ ..

సీజనల్ వ్యాధులను ఎలా నివారించాలి?

ఫ్లూ కేసులలో 40% పెరుగుదల, అలెర్జీలలో 60% పెరుగుదల , వైరల్ ఇన్ఫెక్షన్లలో 80% పెరుగుదల గత కొన్ని నెలలుగా ఉన్నట్లు స్పష్టమౌతున్న నేపధ్యంలో దీనికి ప్రధాన కారణం బలహీనంగా ఉన్న రోగనిరోధక శక్తి అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడటం కారణంగానే ఈ తరహా సీజనల్ ఇన్ ఫెక్షన్లు ఎటాక్ చేస్తుంటాయి. ఈ తరహా సమస్యల నుండి బయటపడాలంటే బలమైన రోగనిరోధక వ్యవ్యస్ధను కలిగి ఉండటం ఒక్కటే మార్గం.

రోగనిరోధక వ్యవస్ధను బలపరుచుకునేందుకు ;

సమతుల్య ఆహారం: ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. మంచి పోషకాహారం ఉన్న వారి శరీరం అంటువ్యాధుల నుండి రక్షించబడుతుంది.

READ ALSO : Balineni Srinivasa Reddy : ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో ఒంగోలు పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం.. తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ

రోజవారి వ్యాయామం: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన విధంగా వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక వ్యాయామం అవసరం. వ్యాయామం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది.

తగినంత నిద్ర: నిద్ర లేకపోవడం శరీరానికి రక్షణగా ఉండే రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరుస్తుంది. రోగనిరోధక శక్తిని రీఛార్జ్ చేయడానికి ప్రతి రాత్రి 7-9 గంటల సమయం నిద్రించటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.

టీకా: ప్రతి ఏడాది ఫ్లూ నుండి రక్షణ పొందేందుకు టీకాలు తీసుకోవటాన్ని మర్చిపోరాదు. టీకాలు తీసుకోవటం వల్ల ఫ్లూ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

READ ALSO : Sundar Pichai thanks PM Modi : ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ…ఏం చర్చించారంటే…

సీజనల్ వ్యాధులను నివారించడం ;

చేతుల పరిశుభ్రత: ఏదైన వస్తువులను, బహిరంగ ప్రదేశాలను తాకిన తరువాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బు , నీటితో చేతులను క్రమం తప్పకుండా కడగాలి. చేతులను ముఖంపై తాకినసందర్భంలో ముక్కుల ద్వారా క్రిములు చేరకుండా చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

సన్నిహిత సంబంధాలకు దూరంగా : తెలిసిన వ్యక్తులు, సన్నిహితులు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి సురక్షితమైన దూరం పాటించటానికి ప్రయత్నించండి. అలాంటి వారికి సన్నిహితంగా ఉంటే అనారోగ్యాలు త్వరగా వ్యాపిస్తాయి.

READ ALSO : Apple Diwali Sale Offers : ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్స్‌పై రూ. 10వేల వరకు తగ్గింపు

ఫేస్ మాస్క్‌లు: మాస్క్ ధరించడం వల్ల శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. COVID-19 మహమ్మారితో మాస్కుల ధరించాల్సిన అవశ్యకత బాగా పెరిగిం. దీని వల్ల ఫ్లూ , జలుబుల వంటి వాటిని నివారించటం సాధ్యమౌతుంది.

కాలానుగుణ పెరుగుతున్న వ్యాధుల నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే సరైన చర్యలు తీసుకోవటం చాలా అవసరం. దీని వల్ల ఇన్ ఫెక్షన్లు దరి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక : అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.