Natural Anaesthesia : అనస్థీషియా లక్షణాలతో కూడిన ఆహారాలు.. అవేంటో తెలుసా ?

దంతాల నొప్పితో బాధపడుతున్న సందర్భంలో లవంగాలను ఉపయోగించటం పూర్వకాలం నుండి మనం చూస్తేనే ఉన్నాయి. నొప్పిని తగ్గించడానికి లవంగాలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. లవంగాలలోని ప్రాథమిక భాగం అయిన యూజినాల్ ఒక సహజ మత్తుమందుగా పనిచేస్తుంది.

Natural Anaesthesia : అనస్థీషియా లక్షణాలతో కూడిన ఆహారాలు.. అవేంటో తెలుసా ?

Foods with anesthetic properties

Natural Anaesthesia : రోగికి నొప్పి లేకుండా శస్త్ర చికిత్స చేయటంలో అనస్థీషియా అనేది ఒక విప్లవాత్మక మైన మార్పు. 16 అక్టోబర్ 1846న అనస్థీషియా పుట్టింది. దీనినే మనం ఆపరేషన్ల సమయంలో నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుగా అభివర్ణిస్తుంటాం. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో వైద్యులు మొదటిసారిగా రోగిపై ఈథర్‌ను ఉపయోగించటం ద్వారా అనస్ధీషియా అనేది వెలుగులోకి వచ్చింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మనం రోజువారిగా వినియోగించి అనేక ఆహారాలు అనస్థీషియా లక్షణాలను కలిగి ఉంటాయి. అలాంటి ఆహారాలలో కొన్నింటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Seasonal Diseases : పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. నివారణకు అనుసరించాల్సిన సరైన పద్ధతులు

అనస్థీషియా వంటి గుణాలు కలిగిన ఆహారాలు ;

1. మిరపకాయలు

కారంగా ఉండే మిరపకాయను నోట్లో పెట్టుకుని కొరికిన తర్వాత ఒకరకమైన జలదరింపు అనుభూతి కలుగుతుంది. ఇలాంటి పరిస్ధితిని చాలా సందర్భాల్లో ఎదుర్కొనే ఉంటారు. మిరపకాయలో వేడికి కారణమయ్యే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం మత్తుమందుగా పనిచేస్తుంది. నొప్పి లేకుండా చేయటంలో క్యాప్సైసిన్ క్రీములు బాగా  పనిచేస్తున్నట్లు పరిశోధకులు సైతం కనుగొన్నారు.

2. లవంగాలు

దంతాల నొప్పితో బాధపడుతున్న సందర్భంలో లవంగాలను ఉపయోగించటం పూర్వకాలం నుండి మనం చూస్తేనే ఉన్నాయి. నొప్పిని తగ్గించడానికి లవంగాలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. లవంగాలలోని ప్రాథమిక భాగం అయిన యూజినాల్ ఒక సహజ మత్తుమందుగా పనిచేస్తుంది. జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం యూజినాల్ పంటి నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తున్నట్లు తెలింది.

READ ALSO : Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

3. అల్లం

అల్లం కడుపు నొప్పిని తగ్గించడానికి మాత్రమే కాదు. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం నొప్పి నివారిణి లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు.. ఇది కడుపునొప్పి సందర్భంలో సహజ నొప్పి నివారిణిగా సహాయపడుతుంది.

శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధనలో, ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం ద్వారా మిరపకాయలోని క్యాప్సైసిన్‌కు మెదడు ప్రతిస్పందిస్తుందని నిర్ధారించారు. తద్వారా తిమ్మిరిని కలిగించే సహజ నొప్పి నివారిణిలను విడుదల చేస్తుందని తేలింది. అదేవిధంగా, లవంగాలలోని యూజినాల్ మరియు అల్లంలోని జింజెరాల్ నొప్పి గ్రాహకాలతో సంకర్షణ చెంది మెదడుకు నొప్పి సంకేతాలను తగ్గిస్తాయని నిర్ధారణ అయింది.

READ ALSO : రూపే క్రెడిట్ కార్డుతో గూగుల్ పే యూపీఐ పేమెంట్..!

కాబట్టి మిరపకాయలు, లవంగాలు, అల్లం వంటి ఆహారాలు తేలికపాటి మత్తుమందు ప్రభావాలు కలిగి ఉంటాయి. అవి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే వైద్య చికిత్సకు ఉపయోగించే అనస్థీషియాకు ప్రత్యామ్నాయం కాదు. అనస్థీషియా-వంటి లక్షణాలతో కూడిన ఆహారాలు, సహజ సమ్మేళనాలలో కనిపించే ప్రయోజనాలకు ఒక ఉదాహరణ మాత్రంగా తీసుకోవాలి. అవి కొంత ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. వైద్య విధానాలలో ఆధునిక అనస్థీషియా పద్ధతుల కంటే మెరుగైనవి కావనే చెప్పాలి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.