Navaratri 2023 : పరమశివుడికే అన్నదానం చేసిన ‘అన్నపూర్ణా దేవి’

పరమశివుడికే అన్నదానం చేసింది 'శ్రీ అన్నపూర్ణా దేవి'. అమ్మవారిని పూజిస్తే తిండికి లోటుండదు. ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్యరాసుల్ని కురిపిస్తుంది.

Navaratri 2023 : పరమశివుడికే అన్నదానం చేసిన ‘అన్నపూర్ణా దేవి’

Navaratri 2023

Navaratri 2023 : నవరాత్రుల్లో మూడవ రోజు దుర్గమ్మ ‘శ్రీ అన్నపూర్ణా దేవిగా’ దర్శనం ఇస్తున్నారు. ఈరోజు అమ్మవారి అలంకరణ విశిష్టత ఏమిటి? అమ్మవారికి ఏమి నైవేద్యాలు పెట్టాలి? తెలుసుకుందాం.

కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్రిగా ‘శ్రీ అన్నపూర్ణా దేవి’ విరాజిల్లుతోంది. సకల ప్రాణికోటికి అన్నం ఆధారం. అన్నపూర్ణా దేవిని పూజిస్తే తిండికి లోటుండదు. ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. ఈరోజు అమ్మవారు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్ఫాలతో అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారు.

Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

ఓసారి శివుడు పార్వతీదేవితో ప్రపంచమంతా మాయ.. అన్నం కూడా మాయ అన్నాడట. ఆ మాటలు నచ్చని పార్వతీదేవి కాశీని విడిచిపెట్టిందట. దాంతో అక్కడ దుర్భరమైన కరువు ఏర్పడిందట. ప్రజలంతా అన్నం దొరక్క అలమటించిపోయారట. ప్రజల కష్టాలు చూసి చలించిపోయిన పార్వతీదేవి తిరిగి కాశీకి వచ్చి భక్తులను కరుణించిందని చెబుతారు.

పార్వతీదేవి కాశీకి తిరిగి రావడంతో శివుడు ఆమె దగ్గరకు వెళ్లి తన భిక్షాపాత్రను చూపించి తను అన్నం మాయ అనడం సరికాదని తెలుసుకున్నట్లు చెప్పాడట. భర్త సత్యాన్ని గ్రహించినందుకు పార్వతీదేవి సంతోషంగా శివుడికి భోజనం పెట్టిందట. పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తారు.

Bathukamma 2023: బృహదీశ్వరాలయానికి బతుకమ్మకు సంబంధమేంటి..?

తినే ఏ పదార్ధాలను వృధా చేయకూడదు. అలా ఉంటేనే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్యరాసుల్ని కురిపిస్తుంది. వృధాగా పారేస్తుంటే భోజనానికి వెంపర్లాడే పరిస్థితి వస్తుంది. అందుకే అన్నాన్ని గౌరవించాలి.