KCR : ప్రచార పర్వంలో గులాబీ బాస్ జోష్.. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం కావడంతో పార్టీ శ్రేణులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

KCR : ప్రచార పర్వంలో గులాబీ బాస్ జోష్.. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

KCR election campaign

Updated On : October 17, 2023 / 8:30 AM IST

KCR Election Campaign : తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. వరుసగా జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న జనగాం, భువనగిరి సభల్లో పాల్గొన్న గులాబీ బాస్ ఇవాళ సిద్ధిపేట, సిరిసిల్లలో పర్యటించేందుకు రెడీ అయిపోయారు. తొలుత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు వెళ్తారు.

ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం కావడంతో పార్టీ శ్రేణులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సభకు భారీ జన సమీకరణ చేస్తున్నాయి. మండలాల వారీగా కోటాలు తీసుకుని మరీ జనాన్ని సమీకరించాలని నిర్ణయించాయి.

Revanth Reddy : పాలమూరు – రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కేసీఆర్ కారణం కాదా? రేవంత్ రెడ్డి

మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ జరుగనుంది. మొదటి బైపాస్ రోడ్డులో జరిగే సభకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం సిద్ధిపేటలో ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది.

సిరిసిల్లలో సభ ముగియగానే సీఎం కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ లో సిద్ధిపేటకు వెళ్తారు. అక్కడ జరిగే సభలో పాల్గొని బీఆర్ఎస్ ను ఆశీర్వదించమని ప్రజలను కోరుతారు. సీఎం సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు.