Aloevera : ఆరోగ్యానికి కలబంద చేసే మేలు ఎంతంటే?…

తరచూ జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ ఉన్నవారు కలబంద రసాన్ని రోజుకు 2 సార్లు పూటకు 2 టీస్పూన్ల చొప్పున తీసుకుంటుంటే సమస్యలు తగ్గుతాయి.

Aloevera : ఆరోగ్యానికి కలబంద చేసే మేలు ఎంతంటే?…

Aloevera

Updated On : December 24, 2021 / 11:18 AM IST

Aloevera : కలబందను అలొవెరా అనికూడా అంటారు. కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది. కలబంద మొక్క ఆకులు చిన్న గుత్తిగా వస్తాయి. తరువాత పొడవుగా పెరుగుతాయి. ఈ ఆకులు బాగా పెరగాలే గానీ పుష్టిగా, లావుగా తయారవుతాయి. ఒక్కో ఆకు 24 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. 4-8 సెంటీమీటర్ల వెడల్పును కలిగి ఉంటాయి. ఈ ఆకుల అంచుల్లో ముళ్లు ఉంటాయి.

కలబంద మనకు ఎక్కడ చూసినా లభిస్తుంది. మన చుట్టూ పరిసరాల్లోనూ కనిపిస్తుంది. కలబంద ఆకులను విరిస్తే లోపల తెల్లని, పచ్చని స్రావం బయటకు వస్తుంది. కొంతసేపు అయ్యాక అది గట్టి పడుతుంది. దీన్ని వేడి చేస్తే పలుచని ద్రవంగా మారుతుంది. దీన్నే హెపాటిక్ అలోస్ అంటారు. తీవ్రమైన మంటలో వేడి చేస్తే మరీ పలుచన కాని పదార్థంగా మారి గ్లాసీ అలోస్ గా మారుతుంది. కలబంద గుజ్జు కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. ఆకులు బాగా పెరిగితే వాటిలోని గుజ్జు అంతగా చేదుగా అనిపించదు. గుజ్జు జిగురు గుణం కలిగి ఉంటుంది. శరీరానికి ఇది చలువ చేస్తుంది. కలబంద ఔషధంగానే కాక మొటిమల వంటి చర్మ సమస్యల నుంచి కూడా మనల్ని బయట పడేస్తుంది.

అలోవెరా జ్యూస్ లో ఉన్న అనేక విటమిన్స్ మన శరీరంలోని డ్యామేజ్ అయిన బాడీ సెల్స్ లేదా టిష్యూలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. కలబంద గుజ్జులో విటమిన్ ఇ, సి, బి1, బి2, 3లతోపాటు బి6, ఐరన్‌, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. కలబంద గుజ్జులో 7 అత్యంత అవసరమైన అమైనో యాసిడ్లు ఉంటాయి. అందువల్ల జీర్ణశక్తికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ఈ గుజ్జు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి అనేక పోషకాలతో కలిగి ఉంటుంది ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే పావు గ్లాసు మోతాదులో కలబంద రసం తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. కలబంద గుజ్జు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీంతో వ్యాధులు నయం అవుతాయి. చక్కని సౌందర్య పోషక ద్రవ్యంగా కూడా కలబంద గుజ్జు పనిచేస్తుంది.

అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ఇంకా ఈ జ్యూస్ లో మంచి అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మన శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. పలు జీవక్రియల కారణంగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. కలబంద గుజ్జు వాటిని బయటకు పంపిస్తుంది. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రంగా మారుస్తుంది. మలబద్దకం నుంచి బయట పడేస్తుంది.

ఆకలి లేని వారు కలబంద రసం తాగితే ఆకలి పుడుతుంది. పొట్టలో ఉండే అల్సర్లు, తరచూ విరేచనాలు అయ్యే ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉన్నవారు కలబంద రసాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది. కలబంద రసాన్ని 3 టీస్పూన్ల చొప్పున పరగడుపున తీసుకుంటే జీర్ణాశయంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.

కలబంద రసాన్ని తీసుకుంటుంటే జుట్టు బాగా పెరగడానికి దోహదపడుతుంది. దీంట్లో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. కలబంద రసం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. గుండెల్లో మంట, కీళ్లు బిగుసుకుపోవడం, షుగర్ వంటి వ్యాధులు తగ్గుతాయి. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కలబంద రసం వాడకం వల్ల కండరాలు, కీళ్లు ఉత్తేజంగా మారుతాయి. ఆయా భాగాలలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి.

తరచూ జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ ఉన్నవారు కలబంద రసాన్ని రోజుకు 2 సార్లు పూటకు 2 టీస్పూన్ల చొప్పున తీసుకుంటుంటే సమస్యలు తగ్గుతాయి. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. అధిక బరువు తగ్గిపోతారు. కలబంద రసం దంతాలను, చిగుళ్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో బాక్టీరియా నశిస్తుంది. స్త్రీల జననేంద్రియాలు బలపడతాయి. జారిన లేదా సున్నితమైన వాళ్ల అవయవాలు దృఢంగా మారి గట్టి పడతాయి.

కాలి పగుళ్లపై రాస్తుంటే పగుళ్లు తగ్గుతాయి. జుట్టుకు వాడితే జుట్టు పెరుగుల బాగుంటుంది. జుట్టు సమస్యలైన జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతాయి. కలబంద రసాన్ని నేరుగా తాగలేకపోతే ఏదైనా పండ్ల రసంలో కలిపి 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. సాధారణంగా వయసు పెరిగే కొద్ది చర్మంపైన ముడతలు పడుతూ ఉంటాయి కానీ ఇతర కారణాలు వలన కొంత మందికి ఎక్కువ వయస్సు రాకుండానే చర్మంపై ముడతలు పడి ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తారు ఈ యాంటీ ఏజింగ్ సంకేతాలను నివారించడంలో కలబంద సహాయపడుతుంది.

కలబంద ఆకుల్లో ముళ్ల కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జలా చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.చర్మపు మృతకణాలు తొలిగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి ఇందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి. ఆముదము నూనె జుట్టు పెరుగుదలకు అద్భుతమైన పనిచేస్తుంది దీనిలో కలబంద కలిపితే మీ తలపై నిద్రాణమైన జుట్టు పెరుగుదలను ప్రేరేపించటానికి సహాయపడుతుంది.