ధారవి ప్రత్యేకత ఏంటి? మురికివాడపై విదేశీయులకు ఎందుకింత ఆసక్తి?

అసలు ధారవి ప్రత్యేకత ఏంటి? ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఇండియాలోని మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా గత ఏడాది ధారవి ఎంపికైంది. అంతేకాదు ఆసియాలోనే అందరినీ ఆకట్టుకుంటున్న టాప్ టెన్ ట్రావెలర్స్ చాయిస్ లో కూడా ధారవి ఏరియాకు చోటు దక్కింది.
అందాల సౌధంగా అందరూ భావించే తాజ్ మహల్ కంటే ధారవి ప్రాంతాన్ని చూడటానికి టూరిస్టులు ఎక్కువ ఆసక్తి చూపించడం నివ్వెరపరచింది. అలాంటి ధారివిని ఇప్పుడు కరోనా వైరస్ తొంగి చూసింది. ఇప్పటికే కొంత మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఒక మరణం కూడా సంభవించింది. ధారవి మురికివాడ ప్రాంతం చాలా దేశాల్లో పాపులర్.
చాలా దేశాల్లో ధారవి స్లమ్ పాపులర్ :
ధారవి ప్రాంతం గురించి రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవడానికి విదేశీ టూరిస్టుల్లో ఆసక్తి మొదలైంది. ఫలితంగా కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. ఈ తాకిడి తట్టుకోవడానికి ముంబై నగరం నుంచి ధారవికి స్పెషల్ బస్సులు వేశారు. ధారవి టూర్ పేరుతో
ఈ బస్సులు తిరుగుతున్నాయి. ఈ ట్రెండ్ కమ్యూనిటీ టూరిజంగా పాపులర్ అయింది. టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ముంబై మహా నగర పాలక సంస్థ కూడా ముందుకొచ్చింది. టూరిస్టులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరోనా భూతం భయాన్ని సృష్టిస్తోంది.
ధారవి టూర్ పేరుతో స్పెషల్ బస్ సర్వీసులు :
దాదాపుగా 593 పైచిలుకు ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతం ధారవి. ఇక్కడ దాదాపు పది లక్షల మంది జనాభా ఉంటారు. నిజానికి ఇది ఒకప్పుడు మురికివాడ కాదు. 19వ శతాబ్దానికి ముందు ధారవి ప్రాంతం ఒక పెద్ద పల్లెటూరు. చేపలు పట్టుకుని బతికే కోలి కులస్తులు ఇక్కడ ఎక్కువగా ఉండేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోలివాడ అని పిలిచేవారు. 1850 తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బతకడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ముంబై నగరానికి రావడం మొదలైంది.
ఇలా వచ్చిన నిరుపేదలంతా ధారవిలో సెటిలవడం ప్రారంభించారు. తొలి రోజుల్లో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారవి ప్రాంతానికి వచ్చి సెటిలయ్యారు. అందుకే ధారవిని చోటా తమిళనాడు అని కూడా అనేవారు. తర్వాతి కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చారు. దీంతో ధారావీ ఒక మినీ ఇండియాగా మారిపోయింది.