Height : ఎత్తు పెరగటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి!..

క్యారెట్స్ లో విటిమన్ సి మరియు ఎలు సమృద్ధిగా ఉంటాయి. . విటమిన్ ఎ ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Height : ఎత్తు పెరగటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి!..

Hight

Updated On : November 7, 2021 / 11:31 AM IST

Height : ఎత్తు పెరగటం అన్నది ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా మారింది. తల్లిదండ్రుల జీన్స్ వల్ల కావచ్చు. తీసుకునే ఆహారం వల్ల కావచ్చు చాలా మంది పిల్లలు ఎత్తు పెరగకుండా పొట్టిగా ఉంటం మనం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేయటం వల్ల సైతం ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎత్తును పెంచడానికి వ్యాయామాలు కూడా సహాయపడుతాయి. వ్యాయామాలతోపాటు కొన్ని రకాల ఆహారాలు తినటం వల్ల బాగా ఎత్తు పెరగవచ్చు.

సాధారణంగా మనిషి పుట్టిన తర్వాత మగవారిలో 18 సంవత్సరాల వరకు,ఆడవారిలో 16 సంవత్సరాల వరకు ఎముకల పెరుగుదల ఉంటుంది. కొన్ని రకాల మినిరల్స్ మరియు ప్రోటీనులు నేచురల్ గా పొడవు పెరగడానికి సహాయపడుతాయి. విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం అంది, ఎముకల పెరుగుదలకు సహాయపడి, వ్యాధినిరోధకత తగ్గి పెరుగుదల మెరుగుపడుతుంది. ప్రోటీలు అధికంగా ఉన్న ఆహారాలు పొడవు పెరుగుటలో సహాయపడే టిష్యులను మర్మత్తు చేసి కొత్త టిష్యూలు ఏర్పడటానికి సహాయపడుతాయి. రెగ్యులర్ డైట్ లో క్యాల్షియ రిచ్ గా ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి

సీపుడ్స్ అయినటువంటి చేపల్లో ప్రోటీలను మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే, టున ఫిష్ లో విటమిన్ డి మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. ఇవి బరువు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. గుడ్లలో విటమిన్ డి మరియు క్యాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకల పెరుగుదల,బలంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల ప్రతి రోజు గుడ్డును తినటం అలవాటు చేసుకోవాలి.

ఆకుకూరల్లో ఎముకల పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉండుట వలన రోజువారీ డైట్ లో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా బ్రోకలీని తినటం అలవాటు చేసుకోవాలి. పండ్లలో అరటిపండును తినటం అలవాటు చేసుకోవాలి. అరటిపండు ఎముకలను బలంగా చేయటమే కాకుండా మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది. పెరుగులో ప్రోటీనుల మరియు క్యాల్షియం, విటమిన్ ఎ, బి, డి మరియు ఇలు సమృద్ధిగా ఉండుట వలన ఎత్తు పెరగటంతో సహాయపడతాయి.

క్యారెట్స్ లో విటిమన్ సి మరియు ఎలు సమృద్ధిగా ఉంటాయి. . విటమిన్ ఎ ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి.ఎముకల్లో విటమిన్స్ మరియు క్యాల్షియం షోషణ జరగాలంటే సోయాప్రోడక్ట్స్ ను మరియు సోయాబీన్స్ సోయా మిల్క్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. గుమ్మడి విత్తనాలు బాడీ టిష్యులను రిపేర్ చేస్తుంది మరియు వాటి స్థానంలో కొత్త టిష్యులు ఏర్పడేందుకు సహాయపడుతుంది. గ్రీన్ బీన్స్ ఎముకల టిష్యులను ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది మరియు రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దాంతో నేచురల్ గా ఎత్తు పెరుగడానికి సహాయపడుతుంది.

మనిషి ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్ ఎక్కువగా టీనేజ్ లో విడుదలవుతుంటాయి. అందుకే టీనేజ్ లో ఉన్నప్పుడు, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన చక్కని పెరుగుదల కనిపిస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కిప్పింగ్ ఆడటం,వ్యాయామం చేయటం, సైకిల్ తొక్కడం, వలన కూడా మంచి మార్పు కనిపిస్తుంది.అయితే చిన్నప్పటి నుండే ఎత్తు పెరగడం మీద ద్రుష్టి పెట్టి సరైన పోషకాహారం ఇవ్వడం వలన మంచి ప్రయోజనం చేకూరుతుంది.