Suffering From Gastritis : గ్యాస్ట్రిటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది?

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం పుండ్లు, ఇతర జీర్ణ రుగ్మతలను తొలగించటంలో సహాయపడతాయి. ఫైబర్ యొక్క ఉత్తమ వనరులుగా బాదం వంటి గింజలు, చియా , అవిసె వంటి గింజలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు ,వోట్స్, క్వినోవా, వైల్డ్ రైస్, బుక్వీట్ వంటి ధాన్యాలు తదితరాలను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Suffering From Gastritis : గ్యాస్ట్రిటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది?

What kind of foods are good for people suffering from gastritis?

Updated On : October 26, 2022 / 6:44 AM IST

Suffering From Gastritis : ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, ఆహారంలో మార్పుల కారణంగా అనేక మంది గ్యాస్ట్రిటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా పొట్టలోని పేగుల్లో పూత , అజీర్ణం, కడుపు నొప్పి, వికారం, కడుపునిండిన అనుభూతి వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో పొట్టలో పేగుల్లో ఏర్పడే పుండ్లు అల్సర్ల లేదా క్యాన్సర్ కు కారణం అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. చికిత్స ద్వారా ఈ వ్యాధిని త్వరితగతిన నయం చేయవచ్చు. వ్యాధి చికిత్స లో భాగంగా తీసుకునే ఆహార పదార్ధాలను మార్చటం వల్ల కొంత మేర సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గ్యాస్ట్రిటిస్ సమస్యకు ఎలాంటి ఆహారాలు తీసుకోవటం మంచిది;

1.యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాలు ; విటమిన్ సి, విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్ కలిగిన ఆహారాలు రోజువారి ఆహారాల్లో ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ వంటివి కడుపు మంట మరియు జీర్ణ రుగ్మతలను తగ్గిస్తాయి. అలాంటి ఆహారాలలో తాజా పండ్లు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడికాయ, బెల్ పెప్పర్స్, ఆకు కూరలు, ఆర్టిచోక్‌లు, ఆస్పరాగస్, సెలెరీ, ఫెన్నెల్, అల్లం, పసుపు, క్రూసిఫెరస్ కూరగాయలు, స్ట్రాబెర్రీలు, యాపిల్స్ మరియు క్రాన్‌బెర్రీస్ ఉన్నాయి.

2. వెల్లుల్లి ; పచ్చి మరియు కూరల్లో ఉడికించి వెల్లుల్లి రెండింటినీ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్సర్ పుండ్లకు ఇది సహజ నివారణిగా పనిచేస్తుంది. వెల్లుల్లి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పచ్చి వెల్లుల్లి పైలోరీ బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. గట్ మైక్రోబయోమ్‌లో ఇతర హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. లికోరైస్గ్లైసిరైజిక్ అనే ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది, కడుపుని శాంతపరచడానికి, జిఐ ట్రాక్ట్‌ను బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3. ప్రోబయోటిక్ ఆహారాలు; ప్రోబయోటిక్ వినియోగం  వల్ల పిలోరి బ్యాక్టీరియాను నియంత్రిస్తాయి. అల్సర్‌లను ప్రేరేపించే జిఐ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. లాక్టోబాసిల్లస్ బల్గారికస్ ప్రోబయోటిక్ ఆహారాలు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉన్న సప్లిమెంట్లు వంటివి ఇది సైటోకిన్‌ల వ్యక్తీకరణను గణనీయంగా నిరోధించడం ద్వారా వాపును తగ్గిస్తాయి.

.4. పీచు పదార్ధాలు ; ఫైబర్ అధికంగా ఉండే ఆహారం పుండ్లు, ఇతర జీర్ణ రుగ్మతలను తొలగించటంలో సహాయపడతాయి. ఫైబర్ యొక్క ఉత్తమ వనరులుగా బాదం వంటి గింజలు, చియా , అవిసె వంటి గింజలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు ,వోట్స్, క్వినోవా, వైల్డ్ రైస్, బుక్వీట్ వంటి ధాన్యాలు తదితరాలను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. ఆరోగ్యకరమైన కొవ్వులు,ప్రోటీన్ ; లీన్ ప్రోటీన్ పేగు గోడను సరిచేయడానికి , వాపును తగ్గించటంలో లో సహాయపడుతుంది. లీకీ గట్ సిండ్రోమ్ వంటి జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. ప్రోటీన్ మూలాలలో గడ్డితిని పెరిగే జంతువుల మాంసం, చేపలు, కోళ్ల గుడ్లు ఉన్నాయి. సాల్మన్ , సార్డినెస్ వంటి చేపలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మంట నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రోగులకు మేలు చేస్తాయి. సులభంగా జీర్ణమయ్యే ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు కొబ్బరి, ఆలివ్ నూనె, అవకాడో నూనె మరియు వెన్న వంటివి కూడా గ్యాస్ట్రిటిస్ సమస్యల నుండి ఉపశమనం కలిగించటంలో సహాయపడతాయి.