World AIDS Vaccination Day : ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవంగా మే 18 వతేదిని ఎందుకు జరుపుకుంటారు ? దాని ప్రాముఖ్యత తెలుసా ?
HIV/AIDSకి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో ప్రపంచ AIDS టీకా దినోత్సవం కీలకమైనది. హెచ్‌ఐవి నివారణ ,చికిత్సలో పెద్ద పురోగతి సాధించినప్పటికీ, యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART)లో వచ్చిన పురోగతితో, హెచ్‌ఐవితో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ కాలం , మెరుగైన జీవితాలను జీవించడానికి తోడ్పడుతుంది. అదే క్రమంలో HIVకి సమర్థవంతమైన వ్యాక్సిన్ అవసరం చాలా ముఖ్యమైనది.

World AIDS Vaccination Day
World AIDS Vaccination Day : ప్రతి సంవత్సరం మే 18న, ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని హెచ్‌ఐవి/ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సాధించిన పురోగతిని గుర్తుచేస్తూ, సమర్థవంతమైన వ్యాక్సిన్ కనుగొనాలని నిరంతరం దాని అవసరాన్ని గుర్తు చేస్తూ జరుపుకుంటారు.
READ ALSO : ఎయిడ్స్ పూర్తిగా నయమైంది, ఈ అదృష్టవంతుడు ప్రపంచంలో రెండో వ్యక్తి
ఈ రోజు ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ;
ప్రపంచ AIDS టీకా దినోత్సవం మే 18, 1998న HIV వ్యాక్సిన్‌ను కనుగొనడానికి తాజా ప్రయత్నాలకు పిలుపునిస్తూ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ ఎయిడ్స్ టీకా దినోత్సవం ప్రారంభమైంది. సురక్షితమైన, ప్రభావవంతగా పనిచేసే HIV వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన పెంచడం అన్నది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆరోజు నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు , సంఘాలు హెచ్ ఐవీ టీకా పరిశోధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటానికి, HIV వ్యాక్సిన్ అభివృద్ధిలో పెట్టుబడిని పెంచడానికి వార్షిక ప్రాతిపదికన సమావేశమౌతువస్తున్నాయి.
READ ALSO : Marriage : తొమ్మిదో పెళ్ళికి సిద్దమైన మహిళ.. వైద్య పరీక్షల్లో ఎయిడ్స్ అని తేలింది.
HIV/AIDSకి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో ప్రపంచ AIDS టీకా దినోత్సవం కీలకమైనది. హెచ్‌ఐవి నివారణ ,చికిత్సలో పెద్ద పురోగతి సాధించినప్పటికీ, యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART)లో వచ్చిన పురోగతితో, హెచ్‌ఐవితో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ కాలం , మెరుగైన జీవితాలను జీవించడానికి తోడ్పడుతుంది. అదే క్రమంలో HIVకి సమర్థవంతమైన వ్యాక్సిన్ అవసరం చాలా ముఖ్యమైనది. ఇప్పటికే వివిధ రకాల వ్యాక్సిన్‌లు అనేక రకాల అంటు వ్యాధులను నియంత్రించడంలో , నిర్మూలించడంలో కీలకంగా మారాయి. అదే తరహాలో HIV టీకా HIV/AIDSకి వ్యతిరేకంగా పోరాటంలో ఒక ముఖ్యమైన పురోగతికి దోహదపడాలని అనేక మంది అకాంక్షిస్తున్నారు.
READ ALSO : రాష్ట్రంలో పెరుగుతున్న ఎయిడ్స్ మరణాలు : ఏడాదిలో 4,250 మంది బలి
అంతే కాకుండా ప్రపంచ AIDS టీకా దినోత్సవం అన్నది పరిశోధకులు, శాస్త్రవేత్తలు, కమ్యూనిటీలు హెచ్‌ఐవి వ్యాక్సిన్‌ను కనుగొనటంలో పని చేస్తున్నప్పుడు ఎదుర్కొనే వివిధ అడ్డంకులను గుర్తు చేస్తుంది. టీకా పరిశోధన, ఆవిష్కరణ , క్లినికల్ ట్రయల్స్‌లో నిరంతర పెట్టుబడి కోసం మద్దతును కూడగట్టడానికి తోడ్పడుతుంది. ప్రపంచ AIDS టీకా దినోత్సవం HIV వ్యాక్సిన్ప రిశోధన గురించి సరైన సమాచారాన్ని ప్రపంచానికి అందించటం ద్వారా , అపోహలు తొలగించి అవాగాహనను ప్రోత్సహిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO : Positive Cafe: హెచ్ఐవీ బాధితులు నడిపిస్తున్న “కేఫ్ పాజిటివ్”: అక్కడికే వెళ్తున్న జనం ఎక్కడో తెలుసా?
హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి మానసిక ధృడత్వాన్ని ఇవ్వటంతోపాటు వ్యాధి కారణంగా మరణించిన వారికి గౌరవసూచకగా కూడా ప్రపంచ AIDS టీకా దినోత్సవం ఉంటుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా HIV నివారణ, చికిత్స , సంరక్షణ సేవలకు అందరికి అదేలా హామీ ఇవ్వడానికి సహకారం అందించేందుకు ప్రోత్సహకంగా ఉంటుంది.