అప్పులు.. ఖర్చులే ఎక్కువ : ఈ కుర్రకారుకు CIBIL స్కోరుపై మక్కువ

  • Published By: sreehari ,Published On : November 29, 2019 / 09:40 AM IST
అప్పులు.. ఖర్చులే ఎక్కువ : ఈ కుర్రకారుకు CIBIL స్కోరుపై మక్కువ

Updated On : November 29, 2019 / 9:40 AM IST

మిలీనియల్స్.. అంటే ప్రస్తుత యువతరం. 21వ శతాబ్దంలో 20ఏళ్ల నుంచి 29ఏళ్ల వయస్సు ఉండే కుర్రకారంతా విలాసవంతమైన జీవనాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీరినే మిలీనియల్స్ అని పిలుస్తారు. తరచూ రుణాలు తీసుకుంటారు. భారీగా ఖర్చులు చేస్తుంటారు. తీసుకున్న రుణాలను కూడా అంతే తొందరగా చెల్లిస్తుంటారు. తమ అవసరాలు తగినట్టుగా ఎంతో జాగ్రత్తగా వ్యవహారిస్తానడంలో సందేహం లేదు. 

అప్పులపై.. అవగాహన ఎక్కువే : 
దేశంలో అతిపెద్దమొత్తంలో అప్పులు చేసేవారిలో మిలీనియల్స్ ఎక్కువ శాతం ఉంటారు. డిజిటల్ రుణాలు ఇచ్చే కంపెనీలు పెరగడంతో ఈజీగా అప్పులు చేసేస్తుంటారు. తేలిగ్గా అప్పు దొరుకుతోందనే భావన కావొచ్చు. CASHe అనే ఆన్‌లైన్ డిజిటల్ లెండింగ్ కంపెనీ రిపోర్టు ప్రకారం.. ప్రొఫెషనల్స్, ఈఎంఐ ఫైనాన్షింగ్, వైద్య ఖర్చులే మిలీనియల్స్ ఎక్కువ శాతం రుణాలు తీసుకుంటున్నారనడానికి ఇలా ఎన్నో కారణాలుగా చెప్పుకోవచ్చు.
CIBIL report, creditworthiness, CASHe, TransUnion CIBIL
ఇటీవల కాలంలో ఈజీ మనీ తీసుకునే సౌకర్యం పెరగడానికి CASHe కంపెనీ వంటి రుణదాతల కంపెనీలు ఎన్నో కారణంగా చెప్పవచ్చు. అంటే.. మిలీనియల్స్ కు అప్పుల పట్ల జాగ్రత్త లేదని కాదు అర్థం. ఎంత రుణం తీసుకుంటున్నాం.. తమ జీవనంపై రుణ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వారికి బాగా తెలుసు. 

CIBIL స్కోరులో వీరిదే పైచేయి :
CIBIL ట్రాన్స్ యూనియన్ అధ్యయనం ప్రకారం.. ఓ క్రెడిట్ సమాచార సంస్థ.. మిలీనియల్స్ సొంతగా తమ రుణాలపై సెల్ఫ్ మానిటర్ చేస్తుంటారని, తమ CIBIL స్కోరు ఎంత ఉందని చెక్ చేసుకుంటారని రిపోర్టులో తెలిపింది. నాన్ మిలీనియల్స్ (14 శాతం)తో పోలిస్తే CIBIL స్కోరు చెక్ చేసుకునే మిలీనియల్స్ 58శాతానికి పైగా పెరిగిందని తెలిపింది.

రుణదారుడిపై విశ్వసనీయతను బట్టి వారికి ఇచ్చే క్రెడిట్ స్కోరు ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ హిస్టరీ ఆధారంగా CIBIL స్కోరులను క్రెడిట్ బ్యూరోలు గణిస్తుంటాయి. సీబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉండొచ్చు. సాధారణంగా 700 CIBIL స్కోరు ఉంటే.. మంచి స్కోరుగా పరిగణిస్తారు. నాన్ మిలీనియల్స్ సగటున 734 కంటే సెల్ఫ్ మానిటరింగ్ మిలీనియల్స్ సగటున CIBIL స్కోరు 740 అత్యధికంగా ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. 

ముందు ఖర్చు చేయి.. గడువులోగా చెల్లించు : 
​​cibilఅప్పటి తరం నుంచి నేటి మిలీనియల్స్ జీవన విధానం, వారి అలవాట్లు పూర్తిగా విభన్నంగా ఉంటాయి. వారి మనీ లైఫ్ కు ఎలాంటి మినహాయింపు ఉండదు. మిలీనియల్స్ కస్టమర్లలో వారి క్రెడిట్, క్రెడిట్ స్కోరు విషయంలో దాదాపు 70 శాతం మంది అవగాహనతో ఉంటున్నారు. ముందు ఆదా.. ఆ తర్వాతే ఖర్చు.. అనే పాత తర విధానం మార్చేసి.. ‘ముందు ఖర్చు చేయి.. గడువులోగా చెల్లించు’ అనే కొత్త విధానానికి పూర్తిగా మారిపోయారు.

వీరి మైండ్ సెట్ కూడా అవసరాలకు తగట్టుగా మార్చేసుకున్నారని మనీ ట్యాప్, లెండింగ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఓఓ అనూజ్ కేకర్ తెలిపారు. మిలీనియల్స్ రుణాలు ఎక్కువగా చేస్తారు.. అందుకే వీరికి క్రెడిట్ విశ్వసనీయత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. మిలీనియల్స్.. కేవలం తమ రుణాలు, ఖర్చుల విషయంలో సెల్ఫ్ మానిటరింగ్ చేసుకుంటారో అంతేకాదు.. తమ క్రెడిట్ స్కోరు మెరుగుపరుచుకోవడంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారని CIBIL రిపోర్టు వెల్లడించింది. 

క్రెడిట్ స్కోరుకు మూల కారణం ఇదే : 
విహారయాత్రలు, పెళ్లిళ్లు లేదా లగ్జరీ వస్తువులను కొనుగోలుపై రుణాలు తీసుకునేందుకు మిలీనియల్స్ ఎప్పుడు ముందుంటారు. తీసుకున్న రుణాలపై ఖర్చులను మితిమీరి చేయరు. రుణాలను సకాలంలో చెల్లించడం వల్ల వారి క్రెడిట్ స్కోరు కూడా మెరుగుపడుతోంది. క్రెడిట్ కార్డు లేదా ఏదైనా కావొచ్చు. తాము తీసుకునే రుణ పరిమితిని లోబడి ఖర్చులు చేయడం.. గడువు తేదీలోగా రుణం మొత్తాన్ని చెల్లించడమే వీరి సిబిల్ మెరుగుపడటానికి మూలకారణమని రిపోర్టు తెలిపింది.

రానురాను మిలీనియల్స్ ఆలోచనా విధానంలో మరింత గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆదాయాన్ని ఆదా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 24శాతం మంది తమ సంపాదనలో పొదుపుకే ప్రాధాన్యత ఇస్తున్నారంతా. రాబోయే రోజుల్లోవీరి సంఖ్య 40శాతానికి పెరిగే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. 

మిలీనియల్స్ అంటే ఏంటి? 
మిలీనియల్స్.. 22ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సులో ఉన్న యువతరాన్ని పిలుస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే మొబైల్స్‌, బ్రాడ్‌బ్యాండ్‌, ఇంటర్నెట్‌ ఏవి లేని రోజుల్లో నాటి తరం జీవితం ఎలా ఉండేదో తెలియని తరమిది. 1980 నుంచి 2000 మధ్య పుట్టినవారే ఈ మిలీనియల్స్‌. టెక్నాలజీలో పుట్టిన వీరంతా ఎన్నో రకాల పరికరాలు, ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్‌ మధ్య పెరుగుతుంటారు.

millennials, credit scores, CIBIL report, creditworthiness, CASHe, TransUnion CIBILసాంకేతికంగా వస్తున్న మార్పుల్లో ప్రతిదాన్నీ ఒంట బట్టించుకోవడం వీరికి అలవాటు. అందుకే వీరిని ‘నెట్‌ జెనరేషన్‌’ అని మిలీనియల్స్ అని ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. వీరి ఆలోచనలే వేరుగా ఉంటాయి. వీరు స్పందించే, ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది.

డబ్బు కూడబెట్టే తీరు కూడా ఎంతో విభన్నంగా ఉంటుంది. గత తరాల వారితో పోలిస్తే వైవిధ్యాన్ని మూటగట్టుకున్న తరంగా చెబుతుంటారు. మీలో కూడా మిలీనియల్స్ వయస్సు ఉన్న వారు ఉన్నారా? మీరు తీసుకునే రుణాలు.. ఖర్చులపై ఏ మేరకు అవగాహన కలిగి ఉన్నారో చెక్ చేసుకోండి. 
Read Also : రూ.351, రూ.199 రీఛార్జ్ : Jio Fiber కొత్త Unlimited ఆఫర్లు ఇవిగో