Pulses : పప్పుధాన్యాలతో…. ఆరోగ్యానికి మరింత మేలు!..

మంచి పుష్టికరమైనది. ప్రాటీన్స్ అధికంగా లభిస్తాయి. ఇది బరువు తగ్గించటానికి చాలా ఉపయోగకరమైనది. అలాగే రోగాలను నిరోధించే శక్తి కలిగి ఉంది.

Pulses : పప్పుధాన్యాలతో…. ఆరోగ్యానికి మరింత మేలు!..

Pulses

Updated On : March 14, 2022 / 12:29 PM IST

Pulses : పప్ప ధాన్యాలు కాలంతో పనిలేకుండా అన్నిరోజుల్లో మనకు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే వాటిలో నిల్వ ఉండేతత్వం ఎక్కువగా ఉంది. సాధారణంగా మనం ఆహారంలో కందులు, శనగలు, పెసలు, మినుములు, సోయా, బొబ్బర్లు. కాబూలి శనగలు, బఠాణిలు, ఉలవలు, రాజ్యా మొదలైన పప్పుధాన్యాలను  రోజూ ఆహారంలో తీసుకోవచ్చు.

పప్పుధాన్యాల్లో ప్రాటీన్లు ఎక్కువగా లభిస్తాయి. పీచు పదార్ధం కూడా బాగా ఉంటుంది. దంవుడు బియ్యంలో కంటే పప్పుధాన్యాల్లోనాలుగింతలుగా పీచు ఉంటుంది. వీటిలో గ్లూటిన్‌, సోడియం, కొలెస్ట్రాల్‌ ఉండదు. ఇన్ని ఉపయోగాలున్న పప్పు ధాన్యాలను మనం రోజూ తీసుకోవాలి. ఒక్కో పప్పు ధాన్యంలో గల పోషక విలువలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కందులు: కందిపవ్చులో శరీరానికి కావల్సినంత శక్తినిచ్చే పిండి పదార్థాలు పుష్టలంగా లభిస్తాయి. ప్రొటీన్లు, కొవ్వు పీచు, పిండి పదార్థాలు తదితర పోషక విలువలను కలిగి ఉండటమే కాకుండా ఇనుము, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి విటమిన్‌లు విరివిగా ఉంటాయి. గర్భిజీ స్రీలకు అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ తగినంతగా వీటిలో లభిస్తుంది. కందిపప్పు దగ్గు, విష ప్రభావం, ఎసిడిటీ, గ్యాస్‌ ట్రబుల్‌, కడుపులో నొప్పి, ఫైల్స్‌ను నివారిస్తుంది.

మేనుములు: శరీరానికి కావలసినంత ప్రాటీన్‌, కొవ్వు పిండిపదార్థాలను మినుముల నుండి పొందవచ్చు. ఇందులో ప్రొటీన్సు, విటమిన్‌ బి ఎక్కువగా లభిస్తాయి. ఆడవారికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాటిలో ఇనుము, ఫోలికియాసిడ్‌, కాల్షియం, మెగ్నిషియం పొటాషియం ఉంటాయి. మినుములను. తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఉలవలు: ఇది ఒక రకమైన పప్పు ధాన్యం. మంచి పుష్టికరమైనది. ప్రాటీన్స్ అధికంగా లభిస్తాయి. ఇది బరువు తగ్గించటానికి చాలా ఉపయోగకరమైనది. అలాగే రోగాలను నిరోధించే శక్తి కలిగి ఉంది. ఇవి కోడిగుడ్డు ఆకారంలో ఉండి రెండు రంగుల్లో బ్రౌను, ఎరుపు రంగులో ఉంటాయి. ఉలవలు ఉడకబెట్టడానికి ఎక్కువ సమయం కావాలి. అందుకే నీటిలో కొన్ని గంటలు నానబెట్టి, ప్రెషర్‌ కుక్కర్‌లో ఉదకబెట్టినట్లయితే తినేందుకు వీలుగా మారతాయి. ఉలవల వల్ల కడుపులో ఉండే నులి వురుగులను శుభ్రం చేస్తూ. కదుపు మంట తగ్గిస్తుంది.

కాబూలి శనగలు : ఇందులో మాంగనీస్‌, ట్రిప్టోఫాన్‌, పీచు, ఎక్కువ మూలంగా కలిగి ఉండటమే కాకుండా ఫాన్స్పరన్‌, ఐరన్‌, కాపర్‌, ప్రొటీన్లు అనే ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది. వీటివల్ల ఆరోగ్యకరమైన జీర్ణశక్తి కలిగి ఉండటానికి, కణజాల ఆరోగ్యానికి, గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచుతూ వృద్ధి చేసేందుకు, ప్రొటీన్లు ఉపకరిస్తాయి.

రాజ్మా గింజలు ; ఇవి శక్తిని ఇస్తాయి. కాలరీలను పెంపొందిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మెదడుకు మంచిది. వినర్ణన సులభం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

బఠాణీలు ; బరువును నియంత్రిన్తుంది. కడువులో వచ్చే క్యాన్సర్‌ను, నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించటమే కాకుండా శక్తినిస్తుంది. మోకాళ్ళనొప్పులు, ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది.

శనగలు ; పీచు పదార్థం కలిగి ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు దోహదపడతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులను అరికడుతాయి. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులున్నవారు తప్పక ఆమారంలో శనగలు తీసుకుంటే మేలు కలుగుతుంది. ఇందులో మాంగనీస్, మాలిబ్డనమ్, ఇనుము, అమైనోయాసిడ్స్ కలిగి ఉంటాయి.

సోయా చిక్కుడు: సోయా చిక్కుడులో 40 శాతం ప్రొటీన్లు, 30 శాతం వింది. పదార్థాలు, 25 శాతం కొవ్వు పదార్థాలు, వలు రకాల విటమిన్లు ఫోలిక్‌ అమ్లం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. సోయాబీన్‌లో మన పెరుగుదలకు ఉపయోగపడే మాంసకృత్తుల ఎముకల పటిష్టతకు అవసరమైన కాల్చియం రక్త పుష్టికి కావలసిన ఇనుము ఎక్కువగా కలిగి ఉంటాయి. అధిక మోతాదులో పీచు పదార్థం ఉండడం వల్ల ‘షుగర్‌’ వ్యాధి తీవ్రతను. తగ్గిస్తుంది.