Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?

అమెరికాలో ఇప్పుడా ఆ యాప్స్ అక్కడి మహిళల్లో వణుకు పుట్టిస్తోంది. ఫోన్లలో యాప్స్ కనిపిస్తే చాలు వెంటనే డిలీట్ చేసేస్తున్నారు.

Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?

Women In The Us Are Deleting Period Tracking Apps From Their Phone (1)

Updated On : June 28, 2022 / 8:44 PM IST

Period Tracking Apps : అమెరికాలో ఇప్పుడా ఆ యాప్స్ అక్కడి మహిళల్లో వణుకు పుట్టిస్తోంది. ఫోన్లలో యాప్స్ కనిపిస్తే చాలు వెంటనే డిలీట్ చేసేస్తున్నారు. మొన్నటివరకూ అదే యాప్స్ వినియోగించిన మహిళలంతా ఫోన్లలో ఆ యాప్స్ డేటా మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నారు. అమెరికాలో ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఒక్కసారిగా ఈ పరిణామం చోటుచేసుకుంది. అప్పటినుంచి మహిళలందరూ తమ నెలసరికి సంబంధించిన డేటాను ఆయా యాప్స్ నుంచి తొలగిస్తున్నారు. పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ ద్వారా తమ నెలసరిని పరీక్షించుకున్న అమెరికాలో మహిళలు ఆ యాప్స్ ఫోన్లలో నుంచి డిలీట్ చేయడానికి అసలు కారణం లేకపోలేదు. ఎందుకంటే.. పీరియడ్ ట్రాకింగ్ యాప్ డేటాను దర్యాప్తు సంస్థలు పొందే అవకాశం ఉందని తెలిసింది.

ఈ డేటా ఆధారంగా అబార్షన్ సేవలను పొందే వారి వివరాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంది. అందుకే అమెరికాలోని మహిళలు తమ ఫోన్ల నుంచి ఈ పీరియడ్ ట్రాకర్ యాప్స్ డిలీట్ చేసేస్తున్నారు. పీరియడ్ ట్రాకర్ యాప్స్ ద్వారా పొందే డేటాను ఇతర సంస్థలకు, అబార్షన్ అందించే సర్వీసులపై ఆయా సంస్థలు దర్యాప్తు సంస్థలతో షేర్ చేసే రిస్క్ ఉంది. ఈ విషయంలో నిపుణుల్లోనూ ఆందోళన నెలకొంది. రో వర్సెస్ వేడ్ తీర్పు ప్రకటించినప్పటి నుంచి ఈ విషయంలో చాలా మంది మహిళలు ట్విట్టర్‌లో పీరియడ్ ట్రాకర్ యాప్స్ డిలీట్ చేశామని ట్వీట్లు పెడుతున్నారు.

Women In The Us Are Deleting Period Tracking Apps From Their Phone

Women In The Us Are Deleting Period Tracking Apps From Their Phone

ముందుగా యాప్స్‌లో సేవ్ చేసిన పర్సనల్ డేటా మొత్తాన్ని డిలీట్ చేసిన తర్వాత తమ ఫోన్లలో నుంచి ఆయా పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు. దాంతో Flo అనే ప్రముఖ పీరియడ్ ట్రాకింగ్ యాప్‌ Unknown Mode ఒకటి తీసుకొస్తోంది. దీని ద్వారా మహిళలు తమ వ్యక్తిగత వివరాలను ఎవరూ యాక్సెస్ చేయకుండా యాప్‌లను వినియోగించడానికి అనుమతిస్తుంది.

గూగుల్, టెస్లా, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ కంపెనీలు కూడా రో వర్సెస్ వేడ్ తీర్పుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. అబార్షన్ చేయించుకోవాల్సిన తమ ఉద్యోగుల కోసం దిగ్గజ కంపెనీలే ప్రత్యేకంగా ఖర్చులను భరించనున్నట్టు వెల్లడించాయి. తమ ఉద్యోగులు అబార్షన్ (గర్భస్రావం) నిషేధం లేని రాష్ట్రానికి వెళ్లేందుకు అయ్యే ఖర్చులను తామే చెల్లించనున్నట్టు వెల్లడించాయి. ప్రతి నెలా ఏ తేదీన పీరియడ్ వచ్చిందన్న వివరాలు ఆయా యాప్స్‌లలో నమోదవుతాయి. ఆలస్యమైతే ఆ వివరాలు కూడా ఉంటాయి. ఒకవేళ గర్భం దాల్చితే పీరియడ్ రాదు. అదే యాప్‌లోని డేటాను పరిశీలిస్తే.. వినియోగదారుల వ్యక్తిగత విషయాలకు బయటకు తెలిసే అవకాశం ఉంది.

Read Also : Periods Diet : పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం!