Women’s Day 2025 : 30 ఏళ్ల మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టాప్ 3 మెడికల్ స్క్రీనింగ్ ఇవే..!

Women's Day 2025 : మహిళా దినోత్సవం రోజున మహిళల ఆరోగ్యం గురించి సరైన అవగాహన ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి అనేక వైద్య పరీక్షలను చేయించుకోవాలి. 30 ఏళ్లలోపు మహిళలకు టాప్ 3 మెడికల్ స్ర్కీనింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Women’s Day 2025 : 30 ఏళ్ల మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టాప్ 3 మెడికల్ స్క్రీనింగ్ ఇవే..!

Women's Day 2025

Updated On : March 8, 2025 / 10:32 PM IST

Women’s Day 2025 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అదే రోజున అన్ని రంగాల మహిళల కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు లింగ సమానత్వం, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం.. 2022 సర్వేలో ముగ్గురిలో ఒకరు అంటే.. దాదాపు ఒక బిలియన్ మహిళలు, మునుపటి రోజులో ఎక్కువ భాగం అనారోగ్య సమస్యలతో బాధపడ్డారని తేలింది.

Read Also : Samsung Galaxy S23 Offer : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.50వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు.. దాదాపు 700 మిలియన్ల మంది మహిళలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మహిళల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. మహిళా దినోత్సవం రోజున వారిని ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. మహిళల ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ముందుగానే గుర్తిస్తే ఆయా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. లేదా చికిత్స చేయొచ్చు.

30 ఏళ్ల మహిళల జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అనేక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే, ప్రారంభ దశలోనే వీటిని గుర్తిస్తే నివారించవచ్చు. ఆపై చికిత్స చేయవచ్చు. సాధారణ వైద్య పరీక్షలు వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ మెడికల్ ఆంకాలజీ వైస్ చైర్మన్ డాక్టర్ మీను వాలియా ప్రకారం.. 30 ఏళ్లలో ప్రతి మహిళ తప్పనిసరిగా మూడు వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.

పాప్ స్మియర్, HPV పరీక్ష (గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్) :
గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా ముదిరే వరకు లక్షణాలు బయటపడవు. అందుకే దీనికి స్క్రీనింగ్ చాలా కీలకం. (HPV) టెస్ట్ అనేది గర్భాశయ క్యాన్సర్‌లకు కారణమయ్యే వైరస్‌ను గుర్తిస్తుంది. అయితే, పాప్ స్మెర్ క్యాన్సర్‌గా అభివృద్ధి చెందే కణాలను గుర్తిస్తుంది. 21 ఏళ్ల వయస్సులో పాప్ స్మెర్‌ టెస్టులు చేయించుకోండి. మీ పరీక్ష ఫలితాలు నార్మల్ ఉంటే.. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి చేయించుకోండి.

మీకు 30 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి 5 ఏళ్లకు HPV పరీక్షకు మారవచ్చు లేదా రెండు పరీక్షలను ఒకేసారి చేయవచ్చు. మీరు HPVకి వ్యాక్సిన్లు వేసినప్పటికీ స్క్రీనింగ్‌లు అవసరమేనని గమనించాలి. ఎందుకంటే.. ఏ టీకా కూడా అన్ని ప్రమాదాల నుంచి రక్షించదు. గర్భాశయ క్యాన్సర్ నివారించగల క్యాన్సర్లలో ఒకటి. ఈ పరీక్షలు సమస్యలు తీవ్రమయ్యే ముందు గుర్తించగలవు. ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చు.

రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ :
మామోగ్రామ్స్ 40 ఏళ్ల వయసులో మొదలవుతాయి. కానీ, 30 ఏళ్ల వయసులో మీ బ్రెస్ట్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చు. నెలకు ఒకసారి అయినా బ్రెస్ట్ సెల్ఫ్ టెస్ట్ చేయించుకోండి. మీ బ్రెస్ట్ కండిషన్ ఎలా ఉంది? ఏదైనా తేడా కనిపిస్తుందో చెక్ చేసుకోండి.

తద్వారా మార్పులు, ప్రారంభ లక్షణాలను వెంటనే గుర్తించవచ్చు. ఆ తర్వాత మీ వైద్యుడితో క్లినికల్ బ్రెస్ట్ టెస్టు చేయించుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే.. ఎంఆర్ఐ లేదా జన్యు పరీక్ష వంటి ముందస్తు స్క్రీనింగ్ గురించి మీ వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకోండి.

బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ :
గుండె జబ్బులు కేవలం వృద్ధులలో మాత్రమే కాదు.. 30 ఏళ్లలోపు మహిళల్లో కూడా గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా ఊబకాయం, ఫ్యామిలీ హిస్టరీ లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి ప్రమాద కారకాలు ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

డయాబెటిస్ ప్రారంభ సంకేతాలను పరీక్షించేందుకు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి షుగర్ టెస్టు చేయించుకోవడం మంచిది. అలాగే, ప్రతి 4 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష (లిపిడ్ ప్రొఫైల్) చేయించుకోవాలి.

Read Also : Summer AC Offers : సమ్మర్ ఆగయా.. ఏసీలపై ఆఫర్లే ఆఫర్లు.. ఈ 4 ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. డబ్బులు, విద్యుత్ రెండూ ఆదా..!

హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెజర్ లేదా గుండె జబ్బుల హిస్టరీ ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరీక్షలను చేయించుకోవాలి. అధిక రక్త కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. 30 ఏళ్ల తొలినాళ్లు సరైన సమయంగా చెప్పవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు చేయించుకోవడం వల్ల రాబయే ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించుకోవచ్చు.