Walking in Monsoons : వర్షాకాలంలో వాకింగ్ చేయటంలేదని బాధపడుతున్నారా ? రోజుకు 10,000 వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకునే మార్గాలు !

వర్షకాలంలో మీ గదికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఇండోర్ స్పేస్‌లలో అటు ఇటు నడుస్తూ ఉండండి. అపార్ట్‌మెంట్ భవనం, కార్యాలయ సముదాయం, పెద్ద షాపింగ్ మాల్ హాలు, వరండాలలో నడవటానికి ప్రయత్నించండి.

Walking in Monsoons : వర్షాకాలంలో వాకింగ్ చేయటంలేదని బాధపడుతున్నారా ? రోజుకు 10,000 వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకునే మార్గాలు !

Walking in Monsoons

Updated On : July 3, 2023 / 1:39 PM IST

Walking in Monsoons : రుతుపవనాలు మండే వేసవి తాపం నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అదే క్రమంలో ఎడతెగని వర్షాలు కొంతమందికి ఉదయాన్నే నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే నడక కోసం బయటకు వెళ్లడం సాధ్యం కాదు. పార్కులు, వాకింగ్ ట్రాకులు నీటితో , బురదతో ఉండటం వల్ల నడవటం ఇబ్బందికరమవుతుంది. అదే క్రమంలో చల్లని వాతావరణానికి తీసుకునే ఆహార మోతాదులు పెరుగుతాయి. ఇది శరీరంలో అదనపు కేలరీలు చేరటానికి దారితీస్తుంది. వర్షలకు నడక నిలిచిపోవటంతో శరీరంలో చేరుతున్న కేలరీలను బర్న్ చేయటం కష్టతరంగా మారుతుంది.

READ ALSO : Diabetes And Exercise : డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఎంత సమయం వాకింగ్ చేయాలో తెలుసా ?

అయితే ఈ సమయంలో ఇండోర్ వ్యాయామం మీ ఫిట్‌నెస్ ను ట్రాక్‌లో ఉండటానికి సహాయపడుతుంది. ఫిట్‌గా ఉండటానికి చాలా మంది అనుసరించే మార్గాల్లో రోజుకు 10,000 అడుగులు నడవటం అన్నది లక్ష్యంగా పెట్టుకోవటం. వర్షకాలంలో ఇంట్లో ఉండే ఈ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవచ్చు. వర్షాకాలంలో చురుగ్గా ఉండటం చాలా అవసరం, ఎందుకంటే వాతావరణం మనల్ని బద్ధకస్తులుగా మారుస్తుంది. ఇంటి మెట్లు ఎక్కటం, సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నడవటం ద్వారా రోజువారి లక్షాల్యను సాధించవచ్చు.

మీకు ఇష్టమైన టీవీ షో చూస్తున్నప్పుడు నడవటం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వర్కౌట్‌ను అవుట్‌డోర్ నుండి ఇండోర్ కు మార్చుకోవచ్చు. రన్నర్లు, ఫుట్‌బాల్ , క్రికెట్ ఆడే వారు, ఇతర అథ్లెట్‌లు ఫిట్‌నెస్ కోసం జిమ్ లేదా ఫిట్‌నెస్ సెంటర్ లలో చేరటం మంచిది. వర్షకాలంలో కూడా నిరంతరాయంగా ఇండోర్ లో వ్యాయామాలు చేయటం వల్ల ఆరోగ్యానికి మేలు కలగటమే కాకుండా శరీరం చురుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Walking : కడుపునిండా తిని వాకింగ్ చేస్తున్నారా!

వర్షం కురుస్తున్నప్పుడు 10,000 అడుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలు ;

1. టీవీ షో చూస్తున్నప్పుడు నడవటం ; వర్షకాలంలో ఇండోర్ వాకింగ్ మంచి ఎంపిక. మీకు ఇష్టమైన టీవీ షో చూస్తున్నప్పుడు, సంగీతం వింటున్నప్పుడు లేదా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు నడుస్తూ ఉండండి. మీరు ఎక్కడికీ వెళ్తున్నట్లు అనిపించకపోయిన్పటికీ అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి.

2. ఇష్టమైన పాటలకు నృత్యం చేయండి ; మరింత ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే మంచి పాటలకు డ్యాన్స్ చేయండి. ఏరోబిక్స్ రొటీన్‌ని అనుసరించడానికి ప్రయత్నించండి. జుంబా, స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్ , హాపింగ్ వంటి కార్యకలాపాలు ఇంట్లోనే చేయగలిగే అద్భుతమైన వ్యాయామాలు.

READ ALSO : Walking : వాకింగ్ తో హై బీపీ తగ్గుతుందా?

3. కార్యాలయం, అపార్ట్మెంట్ హాలులో నడవటం ; వర్షకాలంలో మీ గదికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఇండోర్ స్పేస్‌లలో అటు ఇటు నడుస్తూ ఉండండి. అపార్ట్‌మెంట్ భవనం, కార్యాలయ సముదాయం, పెద్ద షాపింగ్ మాల్ హాలు, వరండాలలో నడవటానికి ప్రయత్నించండి.

4. ట్రెడ్మిల్ పై నడవటం ; ఇంట్లో లేదా వ్యాయామశాలలో ట్రెడ్‌మిల్ , స్టేషనరీ బైక్‌కు యాక్సెస్ కలిగి ఉంటే, వాటిని ఇండోర్ వాకింగ్ కోసం ఉపయోగించండి.

5. బ్యాడ్మింటన్ , టేబుల్ టెన్నిస్ ఆట ; కుటుంబం మరియు స్నేహితులతో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లేదా మినీ గోల్ఫ్ వంటి ఇండోర్ గేమ్‌లలో పాల్గొనవచ్చు. ఈ యాక్టివిటీలు యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా ఇండోర్ రొటీన్‌కు భిన్నంగా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది.

READ ALSO : Brisk Walk: వాకింగ్ చేస్తున్నారా?: అయితే ఇలా చేసి చూడండి

6. దుమ్ము దులపడం , తుడుచుకోవడం వంటి ఇంటిపనులు ; మెట్లు ఎక్కడం, దిగడం, దుమ్ము దులపడం, తుడుచుకోవడం వంటి రోజువారీ కార్యకలాపాలు శారీరక శ్రమకు , అటు ఇటు కదలటానికి దోహదం చేస్తాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా రోజంతా నడుస్తూ ఉండవచ్చు.

నడక లక్ష్యాన్ని చేరుకోవడానికి వర్షం మీకు ఏమాత్రం ఆటంకం కలిగించదు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా చురుకుగా ఉండాలంటే ఇండోర్ లో కొన్ని మార్గాలు మీ ఫిటెనెస్ లక్ష్యాలను కొనసాగించేందుకు సహాయపడతాయి.