Congress Mp Candidates List : కాంగ్రెస్ 8వ జాబితా విడుదల.. తెలంగాణలో మరో 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్.

Congress Mp Candidates List : కాంగ్రెస్ 8వ జాబితా విడుదల.. తెలంగాణలో మరో 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

Congress

Updated On : March 28, 2024 / 12:37 AM IST

Congress Mp Candidates List : లోక్ సభ ఎన్నిలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా 14మంది ఎంపీ అభ్యర్థులతో 8వ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్ నుంచి
టి.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సుగుణ, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అయ్యింది.

మరో 4 స్థానాలు.. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ సీట్లను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్. ఆ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, 8వ జాబితాలో జార్ఖండ్ నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 3, ఉత్తరప్రదేశ్ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.

Also Read : కేసీఆర్, కేటీఆర్ జైలుకే- ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు