అందాల చందమామ కాజల్ అగర్వాల్.. 10 బ్యూటీ టిప్స్, హెల్త్ సీక్రెట్

అందాల చందమామ కాజల్ అగర్వాల్.. 10 బ్యూటీ టిప్స్, హెల్త్ సీక్రెట్

Updated On : March 2, 2021 / 4:39 PM IST

kajal aggarwal:అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాలో హీటెక్కిస్తోంది. పెళ్లి తర్వాత మరింత గ్లామర్ గా కనిపిస్తూ లేటెస్ట్ ఫోటో షూట్లతో అదరగొడుతోంది. రోజువారీ వర్కౌట్లు చేస్తూ ఒకవైపు అందాన్ని ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)


వరుస సినిమాలు చేస్తూనే ఇప్పుడు వెబ్ సిరీస్ లోనూ హాట్ రోల్స్ చేస్తూ హీట్ పెంచుతోంది. వయస్సు పెరుగుతున్న తన బ్యూటీని అలానే మెయింటెన్స్ చేస్తోంది. ఇంతకీ తన బ్యూటీ వెనుక దాగిన ఆ హెల్త్ సీక్రెట్ ఏంటో ఇన్ స్టా వేదికగా రివీల్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)


ప్రతిరోజు యోగా, వెయిట్ వర్కౌట్లతో ఆకట్టుకుంటోంది. వీల్ ఫోజులో యోగా చేస్తున్న కాజల్ ఫొటో ఒకటి ట్రెండ్ అవుతోంది. కొంత సమయం ఇలా చేస్తే.. గుండె ఆరోగ్యంతో పాటు మెటాబాలిజం కూడా మెరుగుపడుతుందని టిప్స్ చెబుతోంది.


హాలీ డే లేదా షూట్ కావొచ్చు. ఏ రోజైనా సరే.. ఉదయం లేవగానే తాను తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏంటో రివీల్ చేసింది. గుడ్లు, పండ్లు, గ్రీన్ స్మూతీలతో డే స్టార్ట్ అవుతుంది. కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్‌తో అందమైన హెయిర్, చర్మాన్ని ఎలా పొందవచ్చో కూడా రెమడీలు చెబుతోంది.


తాను రోజు తినే పండ్లతో ముఖానికి కూడా ఫేస్ క్రీములా అప్లయ్ చేస్తానంటోంది. బొప్పాయి లేదా టమాటోలు తినేటప్పుడు.. కొంచెం తన ముఖానికి కూడా అప్లయ్ చేస్తుంటుంది. సహజమైన కొబ్బరినూనెను తన జుట్టు, స్కిన్ మొత్తం వాడుతుందంట.


అలాగే ఫుడ్ కూడా కొబ్బరినూనెతోనే కుక్ చేస్తుందంట. ఆనియన్ జ్యూస్ అంటే చాలా ఇష్టంగా తాగుతుందంట.. రంగురంగుల ఐలైనర్లతో బోల్డ్ లుక్ ఉండేలా మేకప్ తో రెడీ అవుతుంది.


పర్పల్, గ్రీన్ కలర్లనే ఎక్కువగా వాడుతానని చెబుతోంది. స్కిన్ కేర్ విషయంలో తాను తీసుకునే జాగ్రత్తలు, రెమడీలను రివీల్ చేసింది ఈ భామ..