2011 మే 6న విడేదలైన 100% లవ్.. 2019 మే 6 నాటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాసు నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. 100% లవ్.. 2011 మే 6న విడేదలైన ఈ సినిమా 2019 మే 6 నాటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. బావా, మరదళ్ళ మధ్య రిలేషన్‌ని, చిలిపి గొడవలని, స్టడీస్‌లో పోటీని, మార్కుల కోసం పట్టే కుస్తీని చాలా బాగా చూపించాడు సుకుమార్. చైతు, తమన్నాల కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ అయ్యింది. నాగ చైతన్యని యూత్‌కి మరింత దగ్గర చేసింది 100 పర్సెంట్ లవ్..
బాలు, మహాలక్ష్మీలుగా చైతు, తమన్నాల నటన ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, వెంకట్ ప్రసాద్ విజువల్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. నిర్మాతకి లాభాల పంట పండించిందీ సినిమా.. నందు, నరేష్, కె.ఆర్.విజయ, విజయ్ కుమార్ తదితరులు నటించిన 100 % లవ్, చైతన్య కెరీర్‌లో మెమరబుల్ మూవీగానూ, సుకుమార్ అందించిన లవ్ స్టోరీస్‌లో బెస్ట్ ఫిలింగానూ గుర్తుండిపోతుంది.
వాచ్ కళ్లూ కళ్ళూ ప్లస్ సాంగ్..