సఖి, చంద్రముఖి, యువరాజు.. ఒకే రోజు..
నేటితో చంద్రముఖి 15 సంవత్సరాలు, సఖి, యువరాజు సినిమాలు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాయి..

నేటితో చంద్రముఖి 15 సంవత్సరాలు, సఖి, యువరాజు సినిమాలు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాయి..
సూపర్ స్టార్ రజనీకాంత్ కొంత విరామం తర్వాత సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘చంద్రముఖి’.. కన్నడలో స్టార్ హీరో విష్ణు వర్థన్ నటించిన ‘ఆప్తమిత్ర’ చిత్రాన్ని దర్శకుడు పి.వాసు.. తమిళ్‌లో రజనీతో రీమేక్ చేశారు. 2005 ఏప్రిల్ 14న వేసవి కానుకగా విడుదలైన ఈ చిత్రం నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
కైలాష్, గంగ దంపతులుగా ప్రభు, జ్యోతిక, సైకియాట్రిస్ట్ ఈశ్వర్, వేంకటపతి రాజాగా రజనీ, దుర్గగా నయనతార నటించారు. సినిమాకు రజనీ, జ్యోతిక మెయిన్ పిల్లర్స్‌గా నిలిచారు. విద్యా సాగర్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. పిల్లలతో పాటు మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ‘చంద్రముఖి’..
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం మాస్టర్ పీస్.. బ్యూటిఫుల్ లవ్‌స్టోరి.. ‘సఖి’.. మాధవన్, షాలిని జంటగా నటించిన ‘అలైపాయుతే’ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘సఖి’ పేరుతో విడుదల చేయగా యువతని మరీ ముఖ్యంగా ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. లవ్, ఎమోషన్, మణిరత్నం మార్క్ టేకింగ్, పి.సి. శ్రీరామ్ ఫోటోగ్రఫీ, ఏ.ఆర్. రెహమాన్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. 2000వ సంవత్సరం ఏప్రిల్ 14 విడుదలైన ‘సఖి’ 2020 ఏప్రిల్ 14 నాటికి విజయవంతంగా 20 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.
Read Also : ఏప్రిల్ 14తో ఈ సినిమాలకు లింకేంటి!..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, సిమ్రాన్, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రల్లో.. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యువరాజు’ మిలీనియం ఇయర్ 2000 ఏప్రిల్ 14న విడుదలైంది. మహేశ్ హీరోగా నటించిన రెండవ సినిమా ఇది. రమణ గోగుల సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 2020 ఏప్రిల్ 14 నాటికి ‘యువరాజు’ చిత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. లాక్‌డౌన్ టైములో ఈ సినిమాలు సరదాగా ఓసారి చూసెయ్యండి మరి..