Sreelu : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కూతురు
ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో ఉన్న పృథ్వి ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో బాగా ఫేమ్ సాధించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించాడు. రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ...........

Sreelu T
Prudhviraj : సినీ పరిశ్రమలో వారసులు రావడం చాలా కామన్. కానీ ఇటీవల కొంతమంది సెలబ్రిటీల కూతుళ్లు కూడా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది నిర్మాతలుగా, దర్శకులుగా, మరికొంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే శివాత్మిక, శివాని, నిహారిక.. ఇలా స్టార్ల పిల్లలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పిల్లలు కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో ఉన్న పృథ్వి ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో బాగా ఫేమ్ సాధించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించాడు. రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ అచ్చిరాక మళ్ళీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నాడు. తాజాగా తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను అని తెలిపాడు.
Sreenu Vaitla : విడాకుల గురించి శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చాడా? ఈ ట్వీట్ కి అర్ధం ఏంటి?
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పృథ్వి మాట్లాడుతూ… ”మా అమ్మాయి పేరు శ్రీలు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోని సీన్లని ఇమిటేట్ చేసేది. నటనపై ఇష్టం పెంచుకుంది. పిల్లల ఇష్టం కాదనకూడదు అని తనని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. యాక్టింగ్, డాన్స్ కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంది. నన్ను ఆదరించినట్టే నా కూతుర్ని కూడా ఆదరించాలని” తెలిపాడు. కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాతో పృథ్వి కూతురు శ్రీలు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పృథ్వి స్నేహితుని కుమారుడు క్రాంతి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. త్వరలో ఈ సినిమా షూట్ మొదలవ్వనుంది.
