4 Thousand Students Mega Tribute For Chiranjeevi Waltair Veerayya
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌కు అభిమానుల నుంచి మాసివ్ రెస్పాన్స్ దక్కింది.
Mega154: మెగా154 నుంచి ముందుగానే పేలిన దీపావళి టపాసు.. టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్..
మెగాస్టార్ మరోసారి ఊరమాస్ అవతారంలో థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు చెబుతూ వచ్చారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య మోషన్ పోస్టర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, మెగాస్టార్ చిరంజీవికి మల్లారెడ్డి కాలేజీ విద్యార్ధులు ఓ అదిరిపోయే మెగా ట్రీట్ ఇచ్చారు.
ఏకంగా 4 వేల మంది విద్యార్ధులు కాలేజీ గ్రౌండ్‌లో వరుసగా కూర్చుని చిరంజీవి రూపం వచ్చేలా వారు చేసిన ఫీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య చిత్రంలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The crazy love for Megastar and #WaltairVeerayya has gone to another level ? @KChiruTweets‘s massy look from the movie recreated with formation by students ❤️?
Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/tgXNaeyaPk
— Mythri Movie Makers (@MythriOfficial) October 30, 2022