Mega154: మెగా154 నుంచి ముందుగానే పేలిన దీపావళి టపాసు.. టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మెగా154 సినిమా సంక్రాంతికి రాబోతోంది. రేపు ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. కాగా రేపు రిలీజ్ చేసే ఖచ్చితమైన సమయాన్ని ప్రకటిస్తూ నేడు ఒక టీజర్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Mega154: మెగా154 నుంచి ముందుగానే పేలిన దీపావళి టపాసు.. టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్..

Mega154: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మెగా154 సినిమా సంక్రాంతికి రాబోతోంది. రేపు ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. కాగా రేపు రిలీజ్ చేసే ఖచ్చితమైన సమయాన్ని ప్రకటిస్తూ నేడు ఒక టీజర్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Chiranjeevi: బాలయ్యతో పాటు చిరంజీవి కూడా సైలెంట్ అవుతాడా..?

ఈ వీడియోలో చిరంజీవి చేతికి ఉంగరాల, మేడలో గొలుసు, బ్యాక్ యాంగిల్ లో బీడీ తాగుతూ ఊర మాస్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. చెప్పాలంటే వింటేజ్ చిరుని మళ్ళీ చూస్తున్నట్లు ఉంది. రేపు 11:07 నిమిషాలకు టైటిల్ టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. మూల విరాట్ దర్శనం జరగాలంటే రేపటివరకు ఎదురుచూడాల్సిందే.

ఈ సినిమాలో చిరంజీవి జాలర్ల నాయకుడిగా కనిపించబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.