Miss World Winner 2024 : 28 ఏళ్ల తర్వాత ఇండియాలో.. ఈ ఇయర్ మిస్ వరల్డ్ ఎవరు..?

ఈ ఏడాది మిస్ వరల్డ్ అందాల పోటీలు ముంబైలో జరిగాయి. ఇండియా నుంచి సినీ శెట్టి ఈ రేసులో పోటీ చేసారు. మరి ఈ రేసులో ఎవరు ప్రపచసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు..?

Miss World Winner 2024 : 28 ఏళ్ల తర్వాత ఇండియాలో.. ఈ ఇయర్ మిస్ వరల్డ్ ఎవరు..?

71st Miss World edition Winner 2024 details

Updated On : March 10, 2024 / 8:03 AM IST

Miss World Winner 2024 : ప్రపంచసుందరి కిరీటాన్ని ధరించడం కోసం.. ప్రపంచంలోని అందమైన భామలంతా పోటీ పడుతుంటారు. మిస్ వరల్డ్ ర్యాంప్ స్టేజి పై క్యాట్ వాక్ చేసి తమ అందాలతో ప్రతిఒక్కర్నీ మెస్మరైజ్ చేస్తుంటారు. కానీ వారిలో ఒక భామ మాత్రమే మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంటారు. ఈ ఏడాది జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఇండియాలోని ముంబై వేదిక అయ్యింది.

దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇండియాలో మళ్ళీ ఈ ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. గతంలో 1996లో బెంగళూరులో ఈ ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. మళ్ళీ ఇన్నాళ్ల తరువాత ప్రపంచసుందరీమణుల అందాల పోటీకి ఇండియా వేదిక అయ్యింది. ఈ శనివారం మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఈవెంట్ ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసారు. ఈ నిర్మాతతో పాటు 2013 మిస్ వరల్డ్ మేగన్ యంగ్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ అందాల పోటీలో ఇండియా నుంచి సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించారు. కర్ణాటకకి చెందిన సినీ శెట్టి ముంబైలో పెరిగింది. 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్న సినీ శెట్టి.. ఈ ప్రపంచ సుందరి పోటీలో టాప్ 8 వరకు చేరుకున్నారు. కానీ ఆ తరువాత టాప్ 4 కంటెస్టెంట్స్ లోకి ఎంట్రీ ఇవ్వలేక అందలపోటీ నుంచి వెనుదిరిగారు. మరి ఈ మిస్ వరల్డ్ రేసులో కిరీటాన్ని గెలుచుకున్న సుందరి ఎవరు..?

Also read : Rashmi Gautam : ఫ్యామిలీ మెంబెర్‌ని కోల్పోయిన బాధలో రష్మీ.. అస్థికలతో పోస్టు..

ఈ ఇయర్ మొత్తం 120 మంది అందాలభామలు ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనగా.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ‘క్రిస్టినా పిజ్కోవా’ అనే భామ ఈ ఏడాది ప్రపంచసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. లెబనాన్‌కు చెందిన ‘యాస్మినా’ మొదటి రన్నరప్‌గా నిలిచారు. కాగా చెక్ రిపబ్లిక్‌కు మిస్ వరల్డ్ కిరీటం రావడం ఇది రెండోసారి. గతంలో 2006లో ఈ కిరీటాన్ని ‘తానా కుచరోవా’ సొంతం చేసుకున్నారు.

ఈ ప్రపంచసుందరి కిరీటాన్ని అత్యధికంగా గెలుచుకున్న దేశాలు విషయానికి వస్తే.. ఇండియా, వెనుజులా ఆరు సార్లు మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకొని మొదటి ప్లేస్ లో ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో నాలుగు కిరీటాలతో జమైకా, ఇంగ్లాండ్ ఉన్నాయి.