Oscars95 : ‘నాటు నాటు’తో మొదలైన ఆస్కార్ వేడుక..

ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ అవార్డు వేడుక మన తెలుగు సాంగ్ 'నాటు నాటు'తో ప్రారంభం అయ్యింది.

Oscars95 : ‘నాటు నాటు’తో మొదలైన ఆస్కార్ వేడుక..

95th oscar awards ceremony starts with naatu naatu song

Updated On : March 13, 2023 / 7:27 AM IST

Oscars95 : ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుక చోటు చేసుకుంది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి తారలు తరలివచ్చరు. ఇక RRR మూవీ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ ఈవెంట్ మన తెలుగు సాంగ్ ‘నాటు నాటు’తో ప్రారంభం అయ్యింది.

Oscars95 : ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’కి మిస్ అయ్యిన ఆస్కార్..

ఎం ఎం కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇక ఈ పాటకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు అయితే ఇంటర్నేషనల్ వైడ్ అందర్నీ ఒక ఊపు ఊపేశాయి. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆస్కార్ ఈవెంట్ ని మొదలు పెడుతూ హోస్ట్ గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ గురించి మాట్లాడిన తరువాత ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు స్టేజి పై మరికొందరు డాన్సర్స్ నాటు నాటు స్టెప్పు వేశాడు. దీంతో నాటు నాటు తో ఆస్కార్ వేడుక మొదలైంది.

Oscars95 Live updates : 95వ ఆస్కార్ వేడుకలు.. లైవ్ అప్డేట్స్..

కాగా ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుక ఒక తెలుగు పాటతో మొదలు కావడంతో తెలుగు ఆడియన్స్.. తెలుగు వాళ్ళకి ఇంతటి గౌరవం కలిగించినందుకు రాజమౌళి మరియు మూవీ టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఈ పాట ఆస్కార్ గెలవడం ఒక్కటే మిగిలి ఉంది.