అల్లూ అర్జున్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు

  • Publish Date - September 17, 2020 / 07:08 AM IST

తెలుగు సినిమా హీరో స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్‌పై కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఆయనపై కోవిడ్-19ప్రోటోకాల్ పాటించని కారణంగా చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అధికారుల ఫిర్యాదు ప్రకారం.. కుంటాల జలపాతం సందర్శనను నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా యూనిట్ సభ్యులు అందరూ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి జలపాతాన్ని సందర్శించడమే కాకుండా తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు ఫిర్యాదు చేశారు.



https://10tv.in/chiranjeevi-konidela-bold-new-look-fans-funny-comments/
వారు చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇదే విషయమై ఆదిలాబాద్‌ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.