మరణించిన అభిమాని తల్లికి బాలయ్య పరామర్శ.. ఆడియో క్లిప్ వైరల్..

  • Published By: sekhar ,Published On : July 24, 2020 / 08:32 PM IST
మరణించిన అభిమాని తల్లికి బాలయ్య పరామర్శ.. ఆడియో క్లిప్ వైరల్..

Updated On : July 29, 2020 / 10:11 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణను దగ్గరినుండి చూసిన వాళ్లు కల్మషం లేని మనిషి, పసిపిల్లాడి మనస్తత్వం, భోళాశంకరుడు అని చెప్తారు. తన అభిమానులే తనకు శ్రీరామరక్ష అని చెబుతుండే బాలయ్య వారికి ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల
కడప జిల్లా ప్రొద్దుటూరులో బాలయ్య అభిమాని అయిన మహబూబ్ బాషా కరోనాతో మరణించారు. విషయం తెలుసుకున్న బాలయ్య స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి వారి కుటుంబానికి దైర్యంగా ఉండాలని చెప్పారు.


Nadamuri Balakrishna

భాషా తల్లితో బాలయ్య హిందీలో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భాషా కుటుంబం పరిస్థితి, వారి వివరాలు అడిగి తెలుసుకోవడమే కాక.. నేనూ మీ కొడుకులాంటి వాణ్ణే.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి.. భాషా ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు బాలయ్య. తన అభిమాని కుటుంబానికి బాలయ్య స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడం పట్ల నందమూరి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల్లో బాలయ్య మంచి మనసుని, ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు.



https://www.facebook.com/permalink.php?story_fbid=302540997765943&id=101179064568805