Telugu Films: సినీ ప్రేమికులకు పండగే.. ఈ వారం 15 సినిమాలు విడుదల!
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు థియేటర్లకు రావాలా.. ఓటీటీకి ఇవ్వాలా అనే సందిగ్ధంలో విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఒకే ఒక్క అప్షన్ ఓటీటీ కావడంతో అన్నీ..

Telugu Films
Telugu Films: ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు థియేటర్లకు రావాలా.. ఓటీటీకి ఇవ్వాలా అనే సందిగ్ధంలో విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఒకే ఒక్క అప్షన్ ఓటీటీ కావడంతో అన్నీ ఆ బాటలోనే వెళ్లాయి. అనంతరం లాక్ డౌన్ ముగిసి థియేటర్లు తెరుచుకున్నా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానంతో వేచి ఉండే ధోరణి అవలంభిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్లకు రావడంతో మిగతా సినిమాలు కూడా అదే బాటలో వస్తున్నాయి. మరికొందరు ఎందుకొచ్చిన తంటా అని మంచి డీల్ కుదిరితే ఇప్పటికీ ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు.
కాగా, ఈ వారం అటు ఓటీటీలో కానీ.. ఇటు థియేటర్లలో కానీ సినిమా సందడి భారీగా కనిపిస్తుంది. ఈ వారం రెండు డజన్లకుపైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’, యంగ్ హీరో సుశాంత్ నటించిన తాజా సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్ కలిసి నటించిన ‘హౌజ్ అరెస్ట్’, హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘వివాహ భోజనంబు’ సినిమాలు ఈ నెల 27వ తేదీన థియేటర్లకు వస్తున్నాయి.
ఇక, కిరణ్ సబ్బవరం, ప్రియాంకా జవల్కర్ నటించి ఆగష్టు 6న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఎస్ఆర్ కల్యాణమండపం ఈ నెల 27న ఆహా ఓటీటీలో ప్రసారమవుతుండగా.. స్టాండప్ షార్ట్స్ (ఆగస్టు 26), ద కొరియర్ (ఆగస్టు 27) అమెజాన్ ప్రైమ్‌లో.. వివాహ భోజనంబు (ఆగస్టు 27), కసడా తపరా (ఆగస్టు 27) సోనీ లైవ్‌లో.. అన్‌టోల్డ్ (ఆగస్టు 24), పోస్ట్ మార్టమ్ (ఆగస్టు 25), భూమిక (ఆగస్టు 26), హీజ్ ఆల్ దట్ (ఆగస్టు 27) నెట్‌ఫ్లిక్స్‌లో.. ఇంజినీరింగ్ గర్ల్స్ (ఆగస్టు 27) జీ 5లో స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తం మీద థియేటర్లలో కానీ.. ఓటీటీలో కానీ 15 సినిమాలు విడుదలవుతున్నాయి.