Mahesh Babu : మహేష్ బాబు ఇంట్లో చోరీకి యత్నం.. దొంగని పట్టుకొని పోలీసులకి అప్పగించిన సెక్యూరిటీ..
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లో నివసిస్తున్న మహేశ్ బాబు ఇంట్లో దొంగతనం చేయాలని భావించిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ గోడ ఎక్కి లోపలి దూకాడు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉండడంతో..............

A Man Try to theft in Mahesh Babu house
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మహేష్ కుటుంబ సభ్యులు కూడా నిన్న అంతా అక్కడే ఇందిరా దేవి ఇంట్లోనే ఉన్నారు. అయితే ముందురోజు రాత్రి ఓ ప్రబుద్దుడు మహేష్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లో నివసిస్తున్న మహేశ్ బాబు ఇంట్లో దొంగతనం చేయాలని భావించిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ గోడ ఎక్కి లోపలి దూకాడు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉండడంతో కిందపడిన దొంగ గాయపడ్డాడు. శబ్దం రావడంతో మహేష్ ఇంటి సెక్యూరిటీ వెళ్లి చూడగా గాయాలతో పడి ఉన్న దొంగ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించి దొంగని పోలీసులకి అప్పజెప్పారు.
Hero Vishal : అర్ధరాత్రి విశాల్ ఇంటిపై దాడి.. విశాల్ ఇంట్లో లేని సమయంలో.. అద్దాలు పగలగొట్టి..
ఆ దొంగని పోలీసులు విచారించగా.. అతడి పేరు కృష్ణ (30) అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు, మహేష్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. అయితే ఎత్తైన ప్రహరీ గోడ మీద నుంచి దూకడంతో గాయపడిన అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు పోలీసులు.