A R Rahman: మగధీర చూశాక ఒకటే అనుకున్నా.. కానీ ఆ తర్వాత బాహుబలి చూసి.. రాజమౌళి పై ఏఆర్ రెహమాన్ కామెంట్స్!

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాదు ఇండియన్ సినిమా స్థాయిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలిచేలా చేశాడు. కాగా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ రాజమౌళి మరియు అతని పని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

A R Rahman: మగధీర చూశాక ఒకటే అనుకున్నా.. కానీ ఆ తర్వాత బాహుబలి చూసి.. రాజమౌళి పై ఏఆర్ రెహమాన్ కామెంట్స్!

A R Rahman Comments on S S Rajmouli

Updated On : October 20, 2022 / 11:46 AM IST

A R Rahman: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాదు ఇండియన్ సినిమా స్థాయిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలిచేలా చేశాడు. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా హాలీవుడ్ ప్రేక్షకుల అభినందనలతో పాటు, సినీ సాంకేతిక నిపుణులు ప్రశంసలు కూడా అందుకుంటుంది.

ఆర్ఆర్ఆర్: జపాన్ లో RRR సందడి.. ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం..

దీంతో ఈ సినిమాని ప్రపంచంలోని ఇతర భాషలోకి కూడా అనువదిస్తుండగా, ఈ శుక్రవారం జపాన్ లో విడుదలకు సిద్దమవుతుంది. అలాగే రాజమౌళి ఆస్కార్ పై కూడా కన్నేశాడు. RRRతో అది ఎలాగైనా సాధించాలని ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నాడు. కాగా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ రాజమౌళి మరియు అతని పని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మగధీర చూసిన తర్వాత రాజమౌళి సత్తా ఏంటో నాకు అర్ధమైంది. ఆ తరువాత కూడా అతను అలంటి సినిమాలను తియ్యగలడని నేను ఊహించా. కానీ నా అంచనాలను మించి అయన బాహుబలి సినిమాతో నిరూపించాడు. తెలుగు సినిమా స్థాయి పెరగడానికి దోహదపడ్డాడు” అంటూ వ్యాఖ్యానించాడు.