HER : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న యువహీరోయిన్.. ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్..
అక్కినేని హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'చి ల సౌ' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి "రుహాణి శర్మ". మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్న ఈ భామ, ఆ తరువాత 'హిట్-1' సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

A young heroine coming up with a lady oriented movie
HER : అక్కినేని హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘చి ల సౌ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి “రుహాణి శర్మ”. మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్న ఈ భామ, ఆ తరువాత ‘హిట్-1’ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Apsara Rani : చీరలో కూడా చెమటలు పట్టిస్తున్న అప్సర..
ఈ మధ్యకాలంలో వైవిధ్య భరితమైన కథలతో, సహజత్వానికి దగ్గరగా తెరకెక్కే చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ సినిమాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రుహాణి శర్మ ప్రధాన పాత్రలో HER అనే పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి శ్రీధర్ స్వరగావ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న రుహాణి శర్మను హైలైట్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారని పోస్టర్ స్పష్టం చేస్తోంది. రుహాణి శర్మ క్యారెక్టర్ లో కంటతడి కనిపిస్తుండటం, ఆ వెనకాల హై వే, సిటీ పరిసరాలు సినిమాలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. పోస్టర్ పై HER Chapter 1 అనే టైటిల్ వేయడం చూస్తుంటే ఈ సినిమాకు కొనసాగింపు కూడా ఉంటుందని అర్థమవుతోంది. అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.