Aadya
Aadya : పవన్ కళ్యాణ్ OG సినిమా థియేటర్స్ లో అదరగొడుతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా రిజల్ట్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులే కాదు టాలీవుడ్ జనాలు అంతా ప్రీమియర్ షోలకే వెళ్లి OG సినిమాని చూసారు. పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా ప్రీమియర్ కి విమల్ థియేటర్ కి వెళ్లి మరీ షో చూసారు. ఇద్దరూ OG హుడీలు వేసుకొని సినిమాకు వెళ్లిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.(Aadya)
రేణు దేశాయ్ తన కూతురు ఆద్య OG హుడీ వేసుకున్న ఫోటోలు షేర్ చేసి నిన్న రాత్రి స్పెషల్ పోస్ట్ చేసింది. ఆద్య ఫోటోలు షేర్ చేస్తూ..ఆద్య పెద్దయి అతన అన్న అకిరాతో కలిసి పబ్లిక్ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం ఆనందంగా ఉంది. ఆల్రెడీ నిన్న రాత్రి సినిమా చూసింది. ఇవాళ మధ్యాహ్నం చూసింది. మళ్ళీ రేపు కూడా చూస్తుంది. తన నాన్న సినిమాని ఎంజాయ్ చేస్తుంది. లాస్ట్ ఫోటో తన తండ్రి ఐకానిక్ రోల్స్ రెండు మిక్స్ చేసి పర్ఫెక్ట్ గా ఉంది అని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది.
Also Read : Sujeeth : OG సూపర్ హిట్ అయింది.. మరి సుజీత్ నెక్స్ట్ సినిమాలేంటి..? నానితో సినిమా సంగతేంటి..?
దీంతో రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఆద్య OG హుడీ వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also Read : Pradeep Ranganathan : ఇదేం అభిమానంరా బాబు.. OG సినిమా చూడటానికి హైదరాబాద్ వచ్చిన తమిళ్ హీరో.. పోస్ట్ వైరల్..