Aamir Khan : ఇప్పటిలో సినిమాలో నటించే ఆలోచన లేదు.. ఆమిర్‌ఖాన్‌!

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తను ఇప్పటిలో సినిమాలో నటించే ఆలోచన లేదని తెలియజేశాడు. ఒక మూవీ ఫంక్షన్ లో పాల్గొన్న ఆమిర్..

Aamir Khan : ఇప్పటిలో సినిమాలో నటించే ఆలోచన లేదు.. ఆమిర్‌ఖాన్‌!

Aamir Khan said he will do movie when he will is emotionally ready

Updated On : May 31, 2023 / 8:41 PM IST

Aamir Khan Movie : బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కొత్త సినిమా అప్డేట్ కోసం ఆడియన్స్ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ నటించిన లాస్ట్ మూవీ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్‌’ (Forrest Gump) కి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక స్పెషల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ పై ఆమిర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఒక సినిమాలో అతిధి పాత్రలో కనిపించాడు.

Vishwak Sen : మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన విశ్వక్.. ఏ మూవీకో తెలుసా?

అయితే తన తదుపరి సినిమా గురించి ఆమిర్ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఒక మూవీ ఫంక్షన్ కి హాజరయిన ఆమిర్ తన మూవీస్ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. “నా నెక్స్ట్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే నేను ఇప్పటి వరకు దాని పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రెజెంట్ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనీ అనుకుంటున్నా. ఇప్పటిలో సినిమాలో నటించే ఆలోచన లేదు. నేను మానసికంగా సిద్ధం అనుకున్నప్పుడు తప్పకుండా సినిమా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Kangana Ranaut : ప్రియాంక, శ్రుతి ఇప్పుడు మాట్లాడుతున్నారు.. కానీ కంగనా ఆ విషయంలో ఎన్నో సమస్యలను..

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమిర్ మాటలు చూస్తుంటే ఇప్పటిలో సినిమా ఉండదేమో అని అభిమానులు భయపడుతున్నారు. మరి ఆమిర్ ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తాడా? అనేది తనకే తెలియాలి. కాగా దంగల్ (Dangal) తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆమిర్ ఖాన్ అప్పటి నుంచి మరో హిట్టుని అందుకోలేకపోయాడు.