RGV – Saree : ఆర్జీవీ ‘శారీ’ టీజర్ రిలీజ్.. ఆరాధ్య దేవి అందం, క్రైమ్ కలిపి..
తాజాగా ఆర్జీవీ శారీ టీజర్ రిలీజ్ చేసారు.

Aaradhya Devi RGV Saree Movie Teaser Released
RGV – Saree Teaser : గత సంవత్సరం ఆర్జీవీ సోషల్ మీడియాలో చీరలతో ఫోటోషూట్స్ చేసే ఓ మలయాళీ అమ్మాయిని వైరల్ చేసాడు. ఆ అమ్మాయిని వెతికిపెట్టమన్నాడు. ఆ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి)ని కనుక్కొని ఆమెతో శారీ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇటీవల ఆరాధ్య దేవితో శారీలతో స్పెషల్ ఫోటోషూట్, స్పెషల్ సాంగ్ షూట్ చేసి అందులో ఆమె అందాలు చూపిస్తూ వైరల్ చేసాడు ఆర్జీవీ.
ఇక చెప్పినట్టే ఆర్జీవీ శారీ సినిమా తీసి తాజాగా ఈ శారీ టీజర్ రిలీజ్ చేసారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో ఈ శారీ సినిమాని తెరకెక్కించారు. ఈ టీజర్ చూస్తుంటే రెగ్యులర్ గా చీరలోనే తిరిగే ఓ అందమైన అమ్మాయి, ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి, ఆ ప్రేమ ఎక్కువై సైకోగా ఎలా మారాడు అన్నట్టు ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా ఆర్జీవీ శారీ టీజర్ చూసేయండి..
ఇక ఈ శారీ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.