పేదరికంలో మరణించిన క్యాబరే క్వీన్

తొలి బెంగాలీ క్యాబరే డ్యాన్సర్‌, బాలీవుడ్ నటి ఆరితీదాస్ కోల్‌కతాలో అనారోగ్యంతో కన్ను మూశారు.. మమతా బెనర్జీ తదితరులు సంతాపం తెలిపారు..

  • Published By: sekhar ,Published On : February 8, 2020 / 07:07 AM IST
పేదరికంలో మరణించిన క్యాబరే క్వీన్

Updated On : February 8, 2020 / 7:07 AM IST

తొలి బెంగాలీ క్యాబరే డ్యాన్సర్‌, బాలీవుడ్ నటి ఆరితీదాస్ కోల్‌కతాలో అనారోగ్యంతో కన్ను మూశారు.. మమతా బెనర్జీ తదితరులు సంతాపం తెలిపారు..

బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ప్రేక్షకుల్ని రెప్ప వెయ్యనివ్వకుండా చేసిన తొలి బెంగాలీ క్యాబరే డ్యాన్సర్‌ ఆరితీదాస్‌ గురువారం కోల్‌కతాలో కన్ను మూశారు. ఆమె వయసు 77 ఏళ్లు. మిస్‌ షెఫాలీగా ప్రసిద్ధురాలైన ఆరతి.. డ్యాన్సర్‌ మాత్రమే కాదు. విలక్షణ నటి కూడా. సత్యజిత్‌ రే ‘ప్రతిధ్వని’, ‘సీమబద్ధ’ చిత్రాలలో ఆమె నటించారు.

ఆరతీదాస్

ఇటీవలే ఆమె ఆత్మకథ ‘సంధ్యా రతేర్‌ షెఫాలీ’.. పుస్తక రూపంలో విడుదలైంది. తూర్పు బెంగాల్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌) నుంచి శరణార్థులుగా పశ్చిమ బెంగాల్‌ వచ్చిన కుటుంబంలోని ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఆరతీదాస్‌ చివరి అమ్మాయి. పన్నెండేళ్ల వయసులోనే ఇల్లు గడవడానికి అప్పట్లో ప్రముఖులు వచ్చిపోతుండే ‘ఫిర్పో’ అనే రెస్టారెంట్‌లో డాన్స్‌ చేశారు ఆరతి.

Read Also : తేజకి తిండి, సినిమా చాలు అంతే – నాగ శౌర్య

 

ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. పేదరికంలో జీవితాన్ని ప్రారంభించిన ఆరతి పేదరికంలోనే అంతిమశ్వాస వదలడం దురదృష్టకరం. చివరి రోజుల్లో తన అనారోగ్య సమస్యలకు మందులు కూడా కొనుక్కోలేని దీనస్థితిలో ఆమె ఉన్నారని బెంగాలీ పత్రికలు రాశాయి. ఆరతీదాస్ మరణంపట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. 

ఆరతీదాస్