Abhinav Gomatam : చిరంజీవి సినిమాకి రివ్యూ ఏంటి బ్రో.. మళ్ళీ రివ్యూల గురించి మాట్లాడిన అభినవ్ గోమఠం..

అభినవ్ గోమఠం తన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ సినిమాల సమయంలో కూడా సినిమాల రివ్యూల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిరంజీవి ముందు ఇలా రివ్యూల గురించి మాట్లాడటం మరోసారి చర్చగా మారింది.

Abhinav Gomatam : చిరంజీవి సినిమాకి రివ్యూ ఏంటి బ్రో.. మళ్ళీ రివ్యూల గురించి మాట్లాడిన అభినవ్ గోమఠం..

Abhinav Gomatam Sensationa Comments on Movie Reviews in Varun Tej Operation Valentine Pre Release Event

Abhinav Gomatam : మెగా హీరో వరుణ్ తేజ్(Varin Teja) హీరోగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’(Operation Valentine) మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, సాంగ్, ట్రైలర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా నేడు హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావడంతో అనేకమంది మెగా అభిమానులు వచ్చి సందడి చేశారు.

ఈ సినిమాలో నటించిన అభినవ్ గోమఠం కూడా ఈవెంట్ కి రాగా స్టేజిపై మాట్లాడుతూ.. మొదట సినిమా గురించి, తనకు ఎయిర్ ఫోర్స్ కి ఉన్న అనుబంధం గురించి, వరుణ్ తేజ్ గురించి మాట్లాడి అనంతరం.. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసి, ఇన్ని క్యారెక్టర్స్ చేసి కూడా ఇంకా ప్రూవ్ చేసుకోవాలా? చిరంజీవి గారి సినిమా అంటే టికెట్ బుక్ చేసుకొని వెళ్లిపోవడమే. సర్ సినిమా ఎప్పుడూ కూడా ఒక రివ్యూ చదివి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. అయినా చిరంజీవి సినిమాకి రివ్యూ ఏంటి బ్రో, ఆయనకి మనం ఏమన్నా తిరిగి ఇవ్వాలి అనుకుంటే రివ్యూలు చూడకుండా సినిమాకి వెళ్లడమే. నెక్స్ట్ సంక్రాంతికి విశ్వంభర సినిమాకి రివ్యూస్ చూడకుండా వెళ్ళాలి అంటూ మాట్లాడారు.

Also Read : Sagar Chandra : భీమ్లా నాయక్ అర్ధరాత్రి షూట్ చేస్తున్నప్పుడు.. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి వస్తే పవన్ కళ్యాణ్ ఏం చేసారంటే..

ఇటీవల అభినవ్ గోమఠం తన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ సినిమాల సమయంలో కూడా సినిమాల రివ్యూల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిరంజీవి ముందు ఇలా రివ్యూల గురించి మాట్లాడటం మరోసారి చర్చగా మారింది.