Abhinaya : మూగ అమ్మాయి కోసం సినిమాలు ట్రై చేస్తున్నాడు.. పిచ్చోడు అన్నారు.. అభినయ తండ్రి ఎమోషనల్

మూగ, చెవిటి సమస్యలను అధిగమించి నటిగా ప్రూవ్ చేస్తున్న అభినయ అందరికీ తెలుసు. ఈరోజు ఆమె ఈ స్ధాయికి చేరుకోవడం వెనుక అనేక కష్టాలు పడ్డారు. అవేంటో చెబుతూ ఆమె తండ్రి ఆనంద్ ఎమోషనల్ అయ్యారు.

Abhinaya : మూగ అమ్మాయి కోసం సినిమాలు ట్రై చేస్తున్నాడు.. పిచ్చోడు అన్నారు.. అభినయ తండ్రి ఎమోషనల్

Abhinaya

Updated On : October 7, 2023 / 3:12 PM IST

Abhinaya : మూగ, చెవిటి సమస్యలను అధిగమించి మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నారు అభినయ. అసలు చెబితేనే కానీ ఈ సమస్యలు ఉన్నాయని కూడా గుర్తించలేం. అభినయ సినిమాల్లోకి రావడానికి ముందు చాలా కష్టాలు ఎదుర్కున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభినయకి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తాము పడ్డ ఇబ్బందుల గురించి ఆమె తండ్రి ఆనంద్ చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Actress Abhinaya : లవ్, మ్యారేజ్ గురించి నటి అభినయ ఏం చెప్పిందో తెలుసా?

‘నాడోడిగల్’ అనే సినిమాతో అభినయను తమిళ తెరకు పరిచయం చేసారు సముద్రఖని. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ‘శంభో శివ శంభో’ గా తీసారు. రవితేజ, అల్లరి నరేశ్‌లకి చెల్లెలుగా అభినయ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదే సినిమా కన్నడలో కూడా అభినయ నటించి మూడు భాషల్లోకి ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తరువాత తెలుగులో నేనింతే, కింగ్, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహంకాళి, ధృవ, రాజుగారిగది 2, సీతారామం వంటి సినిమాల్లో అలరించారు. ఎవరైనా చెబితేనే కానీ ఆమెకు మూగ, చెవిటి సమస్యలు ఉన్నాయని గుర్తించలేం. నటనలో చక్కని హావభావాలు పలికించే అభినయ కెరియర్ ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కున్నారట.

అభినయ తండ్రి ఆనంద్ కూడా నటుడే. ఆయన ‘జెండా’ అనే సినిమాలో ఓ పాత్ర చేస్తున్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లారట. అలా తనతో షూటింగ్‌కి వచ్చిన సమయంలో అభినయ కూడా నటన పట్ల ఆసక్తి కనపరిచిందట. అభినయ కోసం సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలామంది ఆమె తల్లిదండ్రులపై కోప్పడ్డారట. మూగ అమ్మాయిని తిప్పుతూ సినిమాల్లో ట్రై చేస్తున్నాడు.. పిచ్చోడు అని హేళన చేసారట. ఈ విషయాన్ని చెబుతూ అభినయ తండ్రి ఆనంద్ ఎమోషనల్ అయ్యారు. అభినయ తన తల్లి ప్రోత్సాహం వల్లే ఈరోజు ఈ స్ధాయిలో ఉందని ఆనంద్  చెప్పుకొచ్చారు.

Boyapati Srinu : బాబోయ్ బోయపాటి లైనప్ చూశారా.. సూర్య, బన్నీ, మహేష్.. ఇన్ని సినిమాలా?

అభినయ తన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఈ స్ధాయిలో ఉండేదానిని కాదని చెప్పారు. తన గాడ్ ఫాదర్ సముద్రఖని అని లేదంటే తనకు ఈ అవకాశాలు వచ్చేవి కావని అన్నారు. పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ తనను పూర్తిగా అర్ధం చేసుకున్నవాడు.. ముఖ్యంగా వివాహబంధానికి విలువ ఇచ్చేవాడు తన భర్తగా కోరుకుంటానని ఆమె చెప్పారు. చిన్నపాటి లోపాలకు డిప్రెస్ అయిపోయేవారు ఉంటారు. జీవితంలో ఏది సాధించలేమని వెనకడుగు వేస్తారు. తనకున్న సమస్యలు అసలు సమస్యగా ఎప్పుడూ చూడలేదని.. డిప్రెషన్ అంటే ఏంటో కూడా తెలియదని నవ్వుతూ చెప్పే అభినయని చేస్తే అలాంటి వారు ఖచ్చితంగా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటారు.