Abhishek Agarwal : స్టేజిపై ఏడ్చేసిన టైగర్ నాగేశ్వరరావు నిర్మాత..

నిన్న ఆదివారం రాత్రి హైదరాబాద్ లో టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు.

Abhishek Agarwal : స్టేజిపై ఏడ్చేసిన టైగర్ నాగేశ్వరరావు నిర్మాత..

Abhishek Agarwal Cried on Stage at Tiger Nageswara Rao Pre Release Event

Updated On : October 16, 2023 / 7:19 AM IST

Abhishek Agarwal :  మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’(Tiger Nageswararao) సినిమాతో రాబోతున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై ద‌ర్శ‌కుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు.

నిన్న ఆదివారం రాత్రి హైదరాబాద్ లో టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు. అయితే ఈ ఈవెంట్ లో సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. సినిమా కోసం చాలా కష్టపడ్డామని, నాలుగేళ్ల ప్రాజెక్టు అని చెప్తూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. నిర్మాత ఇలా సినిమా ఈవెంట్లో స్టేజిపై ఏడవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Aadya : టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కూతురు.. రేణు దేశాయ్‌తో పాటు..

అభిషేక్ అగర్వాల్.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో పలు సినిమాలు నిర్మించారు. మొదట వేరే బ్యానర్స్ తో కలిసి కిరాక్ పార్టీ, గూడాచారి, రాజరాజచోర.. లాంటి పలు సినిమాలు నిర్మించారు. ఇటీవల ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ కొట్టారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో మరో సారి పాన్ ఇండియా హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు అభిషేక్ అగర్వాల్. ఈ నిర్మాణ సంస్థలో మరిన్ని భారీ సినిమాలు రానున్నాయి.