Nakokati Nikokati Lyrical : ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదుగా ‘ఉమాపతి’ నుంచి ‘నాకొకటి నీకొకటి’ పాట

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ‘ఉమాపతి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన‌ కలవాని రీమేక్‌గా తెర‌కెక్కుతోంది.

Nakokati Nikokati Lyrical : ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదుగా ‘ఉమాపతి’ నుంచి ‘నాకొకటి నీకొకటి’ పాట

Nakokati Nikokati Lyrical

Updated On : August 8, 2023 / 5:15 PM IST

Nakokati Nikokati Lyrical song : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ‘ఉమాపతి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన‌ కలవాని రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. అనురాగ్ (Anuragh) హీరోగా, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ (Avika Gor) హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సత్య ద్వారంపూడి దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద కే కోటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాసిన పాటను విడుదల చేశారు.

నాకొకటి నీకొకటి అంటూ సాగే ఈ మాస్ పాటను చంద్రబోస్ రాశారు. ఆయన చేతుల మీదుగానే ఈ పాటను విడుద‌ల‌ చేయించారు దర్శక నిర్మాతలు. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందించ‌గా గీతా మాధురి పాడింది. పల్లెటూరి వాతావరణం, రికార్డింగ్ డ్యాన్సులు, ఆ పాటలో వేసిన సెట్లు అన్నీ బాగున్నాయి.

Rocky Aur Rani Kii Prem Kahaani : బాలీవుడ్‌లో మరో 100 కోట్ల సినిమా.. హిందీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయా..?

చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. నీకొకటి నాకొకటి అనే పాటను రిలీజ్ చేశాను. ఇందుకు అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది. పాట ఎంత బాగుంటుందో లిరికల్ వీడియో కూడా అంతే బాగుంది’ అని అన్నారు.

రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేయ‌గా పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఇప్ప‌టికే విడుదలైన‌ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్ర షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. తొంద‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేయ‌నున్నారు.

Jailer Release : గ‌ట్లుంట‌దీ సూప‌ర్‌స్టార్ క్రేజ్ అంటే.. ‘జైలర్‌’ రిలీజ్‌ రోజు బెంగళూరు, చెన్నై ఆఫీసుల‌కు సెలవు, ఫ్రీగా టికెట్లు..