Aamir Khan : కూతురి వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేసిన స్టార్ హీరో.. పెళ్లికొడుకు ఎవరంటే?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్‌కి తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో 2022 లో ఎంగేజ్మెంట్ అయ్యింది. తాజాగా అమీర్ ఖాన్ వారి వివాహ తేదీని ప్రకటించారు.

Aamir Khan

Aamir Khan : బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, నుపుర్ శిఖరే వెడ్డింగ్ డేట్ ఖరారైంది. ఆమిర్ ఖాన్.. తన కుమార్తె వివాహ తేదీని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : నేను, నా కుమార్తె మానసిక సమస్యలని ఎదుర్కొన్నాం.. కూతురితో కలిసి అమీర్ ఖాన్ వీడియో..

ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్‌కి తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో నవంబర్ 18, 2022న నిశ్చితార్థం అయ్యింది. కిరణ్ రావు, ఇమ్రాన్ ఖాన్ కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిపారు. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వీరి పెళ్లి ఈ సంవత్సరం జరగబోతోందని ప్రచారం జరిగినా తాజాగా ఆమిర్ ఖాన్ తన కూతురి వివాహ తేదీని వెల్లడించారు.

ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐరా ఖాన్, నుపుర్ శిఖరే జనవరి 3, 2024 లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమిర్ ఖాన్ ప్రకటించారు. అంతేకాదు నుపుర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. నుపుర్ చాలా అందంగా ఉంటాడని.. తన కొడుకు లాంటి వాడని ఆమిర్ చెప్పారు. ఐరా ఖాన్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు నుపుర్ అమెకు అండగా నిలబడ్డాడని చెప్పుకొచ్చారు. తన కూతురికి ఇంత మంచి భర్త దొరికితే తండ్రిగా తనకింతకంటే ఏం ఆనందం ఉంటుందని ఆమిర్ ఎమోషనల్ అయ్యారు.

Also Read : రీ ఎంట్రీ ఇస్తున్న ఆమిర్ ఖాన్.. కానీ నటుడిగా కాదు..

ఇక  సినిమాల విషయం లోకి వస్తే.. 2024లో ఆమిర్ ఖాన్ భారీ ప్రాజెక్ట్ ‘సితారే జమీన్ పర్’ మొదలుకాబోతోంది. ఈ సినిమా ‘తారే జమీన్ పర్’ తరహాలో ఉంటుందని ఆమిర్ ఖాన్ చెప్పారు. ఈ సినిమా 2024 డిసెంబర్‌లో విడుదల అవుతుందట.  ఆమిర్ నటించిన రీసెంట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ అంత పెద్దగా ఆడలేదు.