Aamir Khan : నేను, నా కుమార్తె మానసిక సమస్యలని ఎదుర్కొన్నాం.. కూతురితో కలిసి అమీర్ ఖాన్ వీడియో..

అమీర్ కూతురు ఐరా కొన్నాళ్ల క్రితం అగాట్సు ఫౌండేషన్ స్థాపించింది. మానసికంగా సమస్యలు ఎదుర్కునే వాళ్ళ కోసమే ఈ ఫౌండేషన్. అలాంటి వారికి సరైన చికిత్స అందిస్తుంది అగాట్సు ఫౌండేషన్.

Aamir Khan : నేను, నా కుమార్తె మానసిక సమస్యలని ఎదుర్కొన్నాం.. కూతురితో కలిసి అమీర్ ఖాన్ వీడియో..

Aamir Khan Ira Khan Shares a Video Regarding Mental Health Issues

Updated On : October 11, 2023 / 9:40 AM IST

Aamir Khan : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక అమీర్ కూతురు ఐరా ఖాన్(Ira Khan) ఇటీవలే ప్రేమించిన వాడ్ని నిశ్చితార్థం కూడా చేసుకుంది. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో తాము మానసిక సమస్యలు(Mental Health Issues) ఎదుర్కొన్నట్టు తెలిపారు. అమీర్ కూతురు ఐరా కొన్నాళ్ల క్రితం అగాట్సు ఫౌండేషన్ స్థాపించింది. మానసికంగా సమస్యలు ఎదుర్కునే వాళ్ళ కోసమే ఈ ఫౌండేషన్. అలాంటి వారికి సరైన చికిత్స అందిస్తుంది అగాట్సు ఫౌండేషన్.

తాజాగా ఐరా ఖాన్ తన తండ్రితో కలిసి వీడియో షేర్ చేయగా ఇందులో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా నిపుణులు ఉంటారు. మనకి ఆ రంగంలో సహాయం కావాలంటే ఆయా నిపుణుల వద్దకు వెళ్ళాలి. అలాగే ప్రతి మనిషికి తమ మానసిక పరిస్థితి బాగోలేకపోతే దాని గురించి తెలుసుకోవడం, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. గతంలో నేను, నా కుమార్తె కూడా ఇలాంటి మానసిక సమస్యలని ఎదుర్కొన్నాం. దానికి చికిత్స కూడా తీసుకున్నాం. మీరు నా సలహా కచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను అని తెలిపాడు.

Also Read : Anasuya : పొలిటికల్ ఎంట్రీ పై అనసూయ కామెంట్స్.. బయట ఉండి కూడా ఉద్దరించొచ్చు..

అలాగే ఈ వీడియోని షేర్ చేసి మానసిక సమస్యలు ఉంటే సంప్రదించమని పలు హెల్ప్ లైన్ నంబర్స్ ని ఐరా ఖాన్ షేర్ చేసింది. దీంతో ఇంతటి మంచి పని చేస్తున్నందుకు పలువురు అభిమానులు, నెటిజన్లు ఐరా ఖాన్ ని, ఆమెకు సపోర్ట్ చేస్తునందుకు తండ్రి అమీర్ ఖాన్ ని అభినందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)