Anasuya : పొలిటికల్ ఎంట్రీ పై అనసూయ కామెంట్స్.. బయట ఉండి కూడా ఉద్దరించొచ్చు..

అనసూయని కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా, రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని అడిగారు.

Anasuya : పొలిటికల్ ఎంట్రీ పై అనసూయ కామెంట్స్.. బయట ఉండి కూడా ఉద్దరించొచ్చు..

Anasuya Interesting Comments on Politics

Updated On : October 11, 2023 / 8:40 AM IST

Anasuya : అనసూయ టీవీకి గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా అంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మెయిన్ లీడ్ గా అనసూయ వరుసగా సినిమాలు చేస్తుంది. త్వరలో రజాకార్ అనే సినిమాతో రాబోతుంది. స్వతంత్రం ముందు, తర్వాత తెలంగాణ(Telangana) రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో రజాకార్(Razakar) సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనసూయ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తుంది.

తాజాగా రజాకార్ సినిమా నుంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అనే పాటని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అనసూయ మెయిన్ లీడ్ కావడంతో సాంగ్ లాంచ్ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు అనసూయ కూడా వచ్చింది. అయితే ఇది రాజకీయ నేపథ్యం సినిమా కావడం, నిర్మాత రాజకీయ నాయకులు కావడంతో పొలిటికల్ సంబంధించిన ప్రశ్నలు కూడా మీడియా వాళ్ళు చిత్రయూనిట్ ని అడిగారు. ఈ నేపథ్యంలో అనసూయని కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా, రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని అడిగారు.

Also Read : Bigg Boss 7 Day 37 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారు? ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు

దీనిపై అనసూయ సమాధానమిస్తూ.. రాజకీయం నా వాళ్ళ కాదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా ఏమన్నా చేయాలంటే బయట ఉండి కూడా ఉద్దరించొచ్చు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం. నేను బయట ఉండే చాలా చేస్తున్నాను, మీకు కూడా తెలుసు అని చెప్పింది. ఇక ఏ పార్టీ వాళ్ళైనా ఆహ్వానించారా, ఈ సినిమా నిర్మాత బీజేపీ నేత కదా అని అడగగా.. నన్ను ఏ పార్టీ వాళ్ళు పిలవలేదు. సినిమా నిర్మాతకు, నాకు మధ్య అసలు రాజకీయాల ప్రస్తావనే రాలేదు అని చెప్పింది అనసూయ. మొత్తానికి అనసూయకి పాలిటిక్స్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ ఇచ్చింది.