Aamir Khan : రీ ఎంట్రీ ఇస్తున్న ఆమిర్ ఖాన్.. కానీ నటుడిగా కాదు..

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ మూవీ ప్లాప్ తో ఆమిర్ సినిమాలకు కొంత బ్రేక్ ప్రకటించాడు. ఇక తన ఎంట్రీ కోసం అభిమానులంతా..

Aamir Khan : రీ ఎంట్రీ ఇస్తున్న ఆమిర్ ఖాన్.. కానీ నటుడిగా కాదు..

Bollywood Hero Aamir Khan re entry update details

Updated On : October 3, 2023 / 9:12 PM IST

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). ఈ చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తూ.. సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ప్లాప్ తో ఆమిర్ కూడా చాలా బాధ పడ్డాడు. దీంతో సినిమాలకు కొంత కాలం గుడ్ బై చెప్పేశాడు. ఆమిర్ నిర్ణయంతో అభిమానులు, సినీ ప్రముఖులు సైతం షాక్ తిన్నారు.

ఆమిర్ సినిమాలకు దూరం అయ్యి ఏడాది గడిచిపోయింది. కానీ ఆమిర్ తన కమ్‌బ్యాక్ గురించి ఎటువంటి అప్డేట్ ని ఇవ్వడం లేదు. ఈ రీ ఎంట్రీ పై బాలీవుడ్ లో ఏదొక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అమిర్ తన రీ ఎంట్రీ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. అయితే అమిర్ నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడం లేదు. నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘లాహోర్ 1947’ అనే టైటిల్ ని పెట్టారు.

Also Read : Siddharth : ఆ జర్నలిస్ట్‌కి స్టేజి పైనే మాస్ వార్నింగ్ ఇచ్చిన సిద్దార్థ్.. మళ్ళీ అతన్నే ఫ్రెండ్ అంటూ..

రాజ్ సంతోషి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ బట్టి చూస్తే.. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో జరగబోతుందని తెలుస్తుంది. భారత్ అండ్ పాకిస్తాన్ విడిపోయే సంఘటనలను ప్రధానంగా ఈ మూవీలో చూపించబోతున్నారని అర్ధమవుతుంది. కాగా సన్నీ డియోల్ ఇటీవల ‘గదర్ 2’ సినిమాతో ఆడియన్స్ ముందుకు భారీ హిట్టుని అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద 690 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని ఈ ఏడాది బాలీవుడ్ మూడో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.