అల్లువారాబ్బాయి : పాలకొల్లులో అల్లు అర్జున్

సంక్రాంతి సంబరాల కోసం కుటుంబంతో కలిసి రాజమండ్రిలో వాలిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో అభిమానుల నుంచి ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది.

  • Published By: madhu ,Published On : January 15, 2019 / 08:47 AM IST
అల్లువారాబ్బాయి : పాలకొల్లులో అల్లు అర్జున్

సంక్రాంతి సంబరాల కోసం కుటుంబంతో కలిసి రాజమండ్రిలో వాలిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో అభిమానుల నుంచి ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది.

రాజమండ్రి : సంక్రాంతి సంబరాల కోసం కుటుంబంతో కలిసి రాజమండ్రిలో వాలిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో అభిమానుల నుంచి ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. విమానాశ్రయంలో తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. తన బంధువులైన కొప్పినీడు వారి ఆహ్వానం మేరకు ఆయన రాజమండ్రిలో దిగారు. పాలకొల్లు దగ్గరలోని కాజా గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కుటుంబంతో కలిసి పాల్గొని అతిథి మర్యాదలు స్వీకరించారు అల్లు అర్జున్..

ఆనందంగా ఉందన్న బన్నీ…
ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. పంచారామ క్షేత్రమైన క్షీరారామలింగేశ్వర స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం నిర్మాణానికి బన్నీ రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. తాను మద్రాసులో జన్మించినా…నాన్న..తాతయ్యలు పొలకొల్లులో జన్మించారని అల్లు అర్జున్ తెలిపారు. ఈ సంక్రాంతి పాలకొల్లులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అల్లు వారబ్బాయి రాకతో కాజా గ్రామం సందడి సందడిగా మారింది..  అల్లు అర్జున్ & ఫ్యామిలీ రాకతో..అభిమానులు భారీగా తరలి వచ్చారు.. కుటుంబంతో కలిసి నవ్వులు చిందిస్తూ..అల్లు అర్జున్ ఫొటోలకు ఫొజులిచ్చారు.