Ambati Arjun : అంబటి అర్జున్‌కి కూతురు పుట్టింది.. బిగ్‌బాస్‌లో చెప్పినట్లుగానే.. ఏం పేరు పెట్టారో తెలుసా?
సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి గుడ్ న్యూస్ చెప్పారు. తనకు కూతురు పుట్టిందంటూ ఇన్‌స్టా స్టోరీలో శుభవార్తను పంచుకున్నారు. కూతురు పేరేంటో తెలుసా?

Ambati Arjun
Ambati Arjun : టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటుడు అర్జున్ అంబటి గురించి పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ 7 సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌గా సందడి చేసారు. భార్య అంబటి సురేఖతో కలిసి పలు షోలలో కూడా కనిపిస్తుంటారు. ఈ జంటకు కూతురు పుట్టింది. ఈ శుభవార్తను అర్జున్ తన్ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు.

Ambati Arjun
బుల్లితెర నటుడిగా అంబటి అర్జున్‌కి మంచి పేరుంది. అర్ధనారి, అగ్ని సాక్షి, దేవత-అనుబంధాల ఆలయం వంటి సీరియల్స్ నటించారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి చివరి వరకు కొనసాగారు. అయితే అర్జున్ హౌస్‌లో ఉన్నప్పుడు భార్య సురేఖ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. సురేఖ హౌస్‌లో అర్జున్‌ని కలవడానికి వచ్చినపుడు కంటెస్టెంట్స్ ఆమెకు సీమంతం కూడా చేసారు. ఆ సమయంలోనే అర్జున్ తమకు పాప పుడితే ‘ఆర్క’ అని పేరు పెడతామని వెల్లడించారు. రీసెంట్‌గా ఈ దంపతులకు పాప పుట్టింది.
Kalki 2898 AD : ‘కల్కి’ రిలీజ్ డేట్ ప్రమోషన్ అదిరిపోయింది.. అనౌన్స్‌మెంట్‌కి టైమర్ ఫిక్స్..
అర్జున్ తన ఇన్ స్టా స్టోరీలో తమకు పాప పుట్టిందనే విషయాన్ని సంతోషంగా షేర్ చేసారు. పేరు ‘ఆర్క’ అని పెట్టినట్లు పోస్టులో వెల్లడించారు. హౌస్‌లో చెప్పినట్లుగానే ఈ జంట తమ చిన్నారికి ‘ఆర్క’ అని పేరు పెట్టారు. ఇక అర్జున్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.