సీనియర్ నటుడు ఆత్మహత్య.. కరోనాతో రచయిత కన్నుమూత..

  • Published By: sekhar ,Published On : November 13, 2020 / 04:28 PM IST
సీనియర్ నటుడు ఆత్మహత్య.. కరోనాతో రచయిత కన్నుమూత..

Updated On : November 13, 2020 / 4:35 PM IST

Asif Basra: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఆసిఫ్‌ బాస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఆయన ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. తన పెంపుడు కుక్కును కట్టేందుకు ఉపయోగించే గొలుసునే ఉరి కోసం వాడినట్టు పోలీసులు గుర్తించారు.Vamsi Rajeshటీవీ నటుడిగా పాపులర్‌ అయిన బాస్రా ‘క్రిష్‌ 3’, ‘ఏక్‌ విలన్‌’, ‘పర్జానియా’, ‘బ్లాక్‌ ఫ్రైడే’ ‘పాతాళ్‌లోక్‌’, ‘జబ్‌ వి మెట్‌’, ‘కేౖ పో చే’, ‘ఫ్రీకీ అలీ’ ‘హిచ్కి’ లాంటి హిట్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘అవుట్‌సోర్స్‌’లో కూడా నటించారు ఆసిఫ్ బాస్రా.


కరోనాతో రచయిత వంశీ రాజేష్ కన్నుమూత
టాలీవుడ్ స్టోరీ రైటర్ వంశీ రాజేష్ కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతున్నారు. వరుణ్ తేజ్ ‘మిస్టర్’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలకు రచయితగా పనిచేశారు వంశీ రాజేష్.


శ్రీను వైట్ల సంతాపం
‘‘ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. నాకు మధురమైన జ్ఞాపకాలను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నా జీవితంలో ఆయన్ని మరిచిపోవడం అంటూ జరగదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వంశీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని శ్రీను వైట్ల పేర్కొన్నారు.