Darshan Surprise visit : ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంటికెళ్లిన స్టార్ హీరో.. సర్‌ఫ్రైజ్!

కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ మంచితనానికి మారుపేరు. ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను మర్చిపోలేదు.

Darshan Surprise visit : ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంటికెళ్లిన స్టార్ హీరో.. సర్‌ఫ్రైజ్!

Darshan Surprise Visit

Updated On : March 23, 2021 / 4:39 PM IST

Darshan surprises RTC bus Driver : కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ మంచితనానికి మారుపేరు. ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను మర్చిపోలేదు. అంతేకాదు.. స్కూల్ కు తనను తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను కూడా మర్చిపోలేదు. ఆ డ్రైవర్ ను ఇంకా గుర్తుపెట్టుకున్న దర్శన్..

అతడి ఇంటికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆర్టీసీ డ్రైవర్‌ పుట్టిన రోజున అతడికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లాడు. ఎప్పటి నుంచో తనను కలుద్దామనుకున్న దర్శన్‌.. బర్త్‌డే రోజు కంటే మరో మంచి సమయం లేదనుకున్నాడు.

డ్రైవర్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాడు. పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆర్టీసీ డ్రైవర్ ఇంటికి వెళ్లి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో దర్శన్ పోస్టు చేశాడు. తన చిన్ననాటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అంటూ అప్పటి అనుభవాలను పంచుకున్నాడు. దాంతో నెటిజన్లంతా దర్శన్ దర్శన్‌ రియల్‌ హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.