Mohan Babu : చిత్ర పరిశ్రమకు అన్నీ కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది.. మంచు మోహన్ బాబు వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దైవ సన్నిధానంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలపై మోహన్ బాబు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.

Mohan Babu

Mohan Babu : అటు సినిమాలు.. ఇటు రాజకీయాల్లో తనదైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇటీవలే ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.

Manchu Vishnu : ‘కన్నప్ప’ మైథలాజికల్ మూవీ కాదు.. మంచు విష్ణు సీరియస్ వీడియో..

జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరగుతున్న నేపథ్యంలో ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జనవరి 14 నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 వరకు ఈ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఆలయ నూతన ఛైర్మన్ మంచు మోహన్ బాబు మాట్లాడారు. చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని.. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం అలా కట్టినదేనని అన్నారు మోహన్ బాబు. ఇది సినిమా దేవాలయం కాదని అందరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు.  ఆలయ అభివృద్ధి కోసం కమిటీ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని.. జనవరి 22 వరకు జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆయన భక్తులకు  పిలుపునిచ్చారు.

Kannappa : ‘కన్నప్ప’తో మరో మంచు వారసుడు ఎంట్రీ.. మోహన్ బాబు మనవడు రాబోతున్నాడు..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందినా విపరీతమైన రద్దీ నేపథ్యంలో తాను  భయపడి వెళ్లడం లేదని మోహన్ బాబు చెప్పారు. ఇక ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం వైస్ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి లక్ష్మి ఉంటారని మోహన్ బాబు ప్రకటించారు. ప్రస్తుతం మోహన్ బాబు ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నారు. మోహన్ బాబు ప్రస్తుతం రాజీకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసారు. ఆ తర్వాత 2019 లో వైసీలో చేసి ప్రచారం చేసారు. ఆ తర్వాత బీజేపీలో చేరతారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు.